ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెక్కపొట్టు లోడుతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బొలెరో వాహనంపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. రాంపూర్-నైనిటాల్ హైవేపై జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.