చాలా మంది ముల్లంగి దుంప తిని ఆకులను పారేస్తుంటారు. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముల్లంగి దుంపతో సమానంగా ఆకుల్లోనూ విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. షుగర్ స్థాయిలను నియంత్రించడంలోనూ సహాయపడతాయి.