AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puja Flower Tips: పూజా ఫలితం పూర్తిగా పొందాలంటే .. ఏ దైవాణ్ని ఏఏ పుష్పాలతో పూజించాలంటే..?

సనాతన ధర్మంలోని మత విశ్వాసాల ప్రకారం ఒక్కో దేవతకు ఒక్కో రకమైన పువ్వులు నచ్చుతాయి. పూజ చేసేటప్పుడు ఆయా దేవుళ్ళకు నచ్చిన పూలను సమర్పిస్తే ఎక్కువ ఫలాలు లభిస్తాయి. పూజించేవారు  కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. భగవంతుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు ఏయే దేవతలకు ఏయే పుష్పాలను సమర్పిస్తారో తెలుసుకుందాం.

Puja Flower Tips: పూజా ఫలితం పూర్తిగా పొందాలంటే .. ఏ దైవాణ్ని ఏఏ పుష్పాలతో పూజించాలంటే..?
Puja Flower Tips
Surya Kala
|

Updated on: Apr 28, 2023 | 9:09 AM

Share

సనాతన సంప్రదాయం ప్రకారం భగవంతుడుని రోజూ పూజిస్తే సాధకుడికి శుభ ఫలితాలను ఇస్తాయని భావిస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం అన్ని రకాల దేవుళ్లను ఆరాధించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడడమే కాదు.. సాధకుడి జీవితంలోని దుఃఖం, పేదరికం కూడా తొలగిపోతాయి. హిందూమతంలో ప్రతి దేవతను పూజించడానికి వివిధ నియమాలు ఇవ్వబడ్డాయి. ఆయా దేవుళ్లను పూజ చేసే సమయంలో  ఉపయోగించే పదార్ధాలు కూడా భిన్నంగా ఉంటాయి. దేవుడికి సంబంధించిన ప్రతి పూజలో లేదా ఆచారాల్లో శుభకార్యాల్లో పువ్వులు ఉపయోగించబడతాయి. పువ్వులు లేకుండా ఏ దేవుడి పూజ చేసినా అది అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.

సనాతన ధర్మంలోని మత విశ్వాసాల ప్రకారం ఒక్కో దేవతకు ఒక్కో రకమైన పువ్వులు నచ్చుతాయి. పూజ చేసేటప్పుడు ఆయా దేవుళ్ళకు నచ్చిన పూలను సమర్పిస్తే ఎక్కువ ఫలాలు లభిస్తాయి. పూజించేవారు  కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. భగవంతుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు ఏయే దేవతలకు ఏయే పుష్పాలను సమర్పిస్తారో తెలుసుకుందాం.

గణేశుడు – హిందూ మత విశ్వాసం ప్రకారం ఏదైనా పవిత్రమైన పర్వదినంలోనైనా లేదా శుభ కార్యాన్ని ప్రారంభించే ముందు గణేశుడిని పూజిస్తారు. ఆ విధంగా, వినకుడిని పూజించే సమయంలో గరికను సమర్పించడం తప్పని సరి. హిందువుల విశ్వాసం ప్రకారం మందార, బంతిపూలు గణపతికి చాలా ప్రీతికరమైనవి. అటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా గణపతి పూజలో మందారం, బంతిపూలు తప్పనిసరి.  గణపతి పూజలో పొరపాటున కూడా తులసిని సమర్పించవద్దు.

ఇవి కూడా చదవండి

శివుడు – శివుని ప్రసన్నం చేసుకోవడానికి జలాన్ని సమర్పించినా చాలు. అయితే బిల్వ పత్రం, ఉమ్మెత్త, బిళ్ళగన్నేరు, అక్షతలు మొదలైన వాటిని సమర్పిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి.

విష్ణువు – హిందూ మత విశ్వాసాల ప్రకారం, శ్రీ హరికి తులసి చాలా ప్రియమైనది. ఈ సందర్భంలో, విష్ణువును పూజించేటప్పుడు తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. అంతేకాదు విష్ణు పూజకు కమలం, మల్లెలు,  వంటి వాటిని సమర్పించినట్లయితే త్వరగా అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.

లక్ష్మీదేవి – సంపదకు దేవతగా లక్ష్మీ దేవి హిందువుల నమ్మకం. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఆ వక్తి జీవితంలో ఎప్పుడూ ఆర్ధిక కష్టాలు ఎదురుకావని విశ్వాసం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి… పూజ సమయంలో తామరపూలను సమర్పించండి. ఇది చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

హనుమంతుడు  – పురాణాల ప్రకారం  హనుమంతుడుని కలియుగ దైవంగా భావిస్తారు. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి.. హనుమంతుడిని పూజించేటప్పుడు, ఎరుపు రంగు పువ్వులు, ఎరుపు బంతి పువ్వులు, మందార వంటి వాటిని సమర్పించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).