Friday Remedies: శుక్రవారం ఈ 7 తప్పులు చేస్తున్నారా.. లక్ష్మీదేవి ఆగ్రహంతో ఆర్ధిక ఇబ్బందులు తప్పవు.. అవి ఏమిటంటే?
సంపదకు అధిదేవత లక్ష్మీ దేవిని పూజించడానికి శుక్రవారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఈ రోజున తెలిసి లేదా తెలియక చేసే పనులు లాభానికి బదులుగా నష్టానికి దారి తీస్తాయి. శుక్రవారం రోజున కొన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని సూచిస్తారు. ఏవి ఏమిటో తెల్సుకుందాం..
హిందూ మత విశ్వాసాల ప్రకారం వారంలోని ప్రతి రోజు ఒక్కొక్క దేవత లేదా దేవుడిని పూజించడానికి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శుక్రవారం లక్ష్మీ దేవి ఆరాధనకు , పూజకు అంకితం చేయబడింది. అదే సమయంలో జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శుక్రవారం శుక్ర గ్రహానికి కూడా సంబంధం కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. ఈ రోజున శుక్ర గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయడం ద్వారా.. సాధకుడు మరిన్ని ప్రయోజనాలను పొందుతాడు. అయితే శుక్రవారాల్లో కొన్ని పనులు చేయడంపై నిషేధం విధించారు. ఇలా చేయడం వలన సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవికి కోపం కలుగుతుందని.. ఆగ్రహం వ్యక్తం చేస్తుందని విశ్వాసం. ఈ రోజు శుక్రవారం చేయకూడని పనులన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం..
- శుక్రవారం నాడు ఎవరి దగ్గరా అప్పు తీసుకోవద్దు. ఎవరికీ అప్పు ఇవ్వొద్దు.. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. కనుక ఈ రోజు ఎలాంటి లావాదేవీలు చేయకూడదని గుర్తుంచుకోండి.
- కొంతకాలంగా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే శుక్రవారం ప్రారంభించకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వలన అశుభ ఫలితాలను పొందవచ్చని.. చేపట్టిన పని చెడిపోవచ్చని నమ్మకం.
- శుక్రవారం పూజ, వంటగదికి సంబంధించిన వస్తువులను కొనకుండా ప్రయత్నించండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలో పురోగతికి ఆటంకం కలుగుతుంది.
- హిందూ మత విశ్వాసాల ప్రకారం.. అమ్మాయిలు దేవతాస్వరూపాలుగా భావిస్తారు. ఆర్థికంగా బలహీనంగా ఉండి.. జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోరుకుంటే, శుక్రవారం రోజున ఏ అమ్మాయిని లేదా స్త్రీని అవమానించకండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహించి ఆర్థిక సమస్యలు కలిగిస్తాయని విశ్వాసం.
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున పంచదార చక్కర చేయకూడదు. చక్కెర శుక్ర గ్రహానికి సంబంధించినదని.. చక్కెరను దానం చేయడం వల్ల మీ జాతకంలో శుక్రుడు బలహీనపడతాడని నమ్ముతారు. ఇలా జరిగితే మీ జీవితంలో సమస్యలు రావచ్చు.
- మురికి ఉన్న ఇంట్లో ప్రతికూల శక్తులు త్వరగా ఆకర్షితులవుతాయి. లక్ష్మీదేవి అటువంటి ప్రదేశాలలో నివసించదు. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవటం ప్రారంభిస్తారు, కాబట్టి మీ ఇల్లు, కార్యాలయాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి.
- శుక్రవారం నాడు లక్ష్మీదేవినే కాదు విష్ణుమూర్తిని కూడా పూజించాలనే నియమం ఉంది. వీలైతే, శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం పూజ చేసేటప్పుడు విష్ణువు పారాయణం చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).