- Telugu News Photo Gallery Spiritual photos Know the amazing facts about Famous Mahakali Temple Pavagadh im Gujarat
Pavagadh Temple: శక్తి పీఠాల్లో ఒకటి.. 3.5 వేల కి.మీ ఎత్తులో నిర్మించిన ఆలయం.. ఎక్కడో తెలుసా..
మనదేశంలో అనేక దేవాలయాలు సహజ నిర్మాణాలు కొన్ని.. రాజులు, రాజపోషకులు వంటి వారు నిర్మించిన ఆలయాలు అనేకం ఉన్నాయి. అటువంటి ఆలయంలో ఒకటి పావగఢ్ ఆలయం. ఇది 3500 అడుగుల ఎత్తులో నిర్మించిన ఆలయం. 500 ఏళ్ల క్రితం ఈ ఆలయ శిఖరాన్ని సుల్తాన్ పడగొట్టాడు. నేటికీ పర్యటకులను ఆకర్షిస్తూనే ఉంది.
Updated on: Apr 25, 2023 | 12:46 PM

పావగఢ్ ఆలయం గుజరాత్‌లోని అతిపెద్ద పర్యాటక, పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం 3.5 వేల అడుగుల ఎత్తులో ఉంది.

గుజరాత్ ఆహారం భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ ఆహారం మాత్రమే కాదు పర్వతంపై నిర్మించిన కాళిక దేవి ఆలయం గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల క్రితం దాడి జరిగింది. 51 శక్తిపీఠాలలో ఒకటి.

ఈ ఆలయం 10వ లేదా 11వ శతాబ్దాల మధ్య నిర్మించబడిందని నమ్ముతారు. కాళీమాత అమ్మవారిని సుమారు 3500 అడుగుల ఎత్తులో ఆవిష్కరించారు. ఈ ఆలయంలోకి అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.

ఈ ఆలయ శిఖరాన్ని సుమారు 500 సంవత్సరాల క్రితం సుల్తాన్ మహమూద్ బెగడ ధ్వంసం చేశాడు. అయితే పురాతన ఆలయాల పునరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా పావగడ కొండపై ఉన్న ఈ 11వ శతాబ్దపు ఆలయ శిఖరాన్ని పునరుద్ధరించారు.

ఈ ఆలయంలో అత్యంత విశిష్టత ఏమిటంటే, దాదాపు 2000 మంది భక్తులు ఒకేసారి అమ్మవారిని దర్శించుకోవచ్చు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి భారీగా భక్తులు చేరుకుంటారు.

ఈ పర్వతంపై ఉన్న ఆలయాన్ని రోప్‌వే లేదా మెట్ల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ ఆలయం దట్టమైన అడవి మధ్యలో ఒక రాతిపై ఉంది. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేటికీ భక్తికి కేంద్రంగా విలసిల్లుతుంది.




