- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: Place these 5 things in pooja Room to vaoid Financial Issues in Home Temple Vastu Tips
Vastu Tips: కనకవృష్టి కోసం పూజగదిలో ఈ వస్తువులు ఉంటే చాలు.. లక్ష్మీకటాక్షం ప్రాప్తించినట్లే..!
Vastu Tips: జ్యోతిష్యశాస్త్రం మాదిరిగానే వాస్తు శాస్త్రం కూడా మానవ జీవితంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండవలసిన వస్తులును నిర్ధిష్ట స్థానం ఉంటుంది. వాటిని ఆయా స్థానాలలో మాత్రమే పెట్టాలి. లేకపోతే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు తప్పువ అంటున్నారు వాస్తు నిపుణులు. ముఖ్యంగా పూజా గది విషయంలో కొన్ని రకాల వస్తువులను పెట్టుకోవాలి. అవి లక్ష్మి దేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవే కాక సంతోషాన్ని ఇచ్చేవి కూడా. మరి లక్ష్మీకటాక్షం కోసం పూజ గదిలో ఏయే వస్తువులు తప్పనిసరిగా పెట్టుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 25, 2023 | 9:54 AM

పూజ గది స్థానం: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య దిక్కులో పూజ గది ఉండడమే శ్రేయస్కరం. ఈ దిశలోనే పూజగది ఉంటే ఇంట్లో సుఖశాంతులు, శాంతి సౌభాగ్యాలు కలుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ దిశలో పూజగది పొరపాటున కూడా ఉంచకూడదు. ఆ వైపు పూజ గది ఉంటే.. ఉన్న ఇంటికి ఆర్థికారోగ్య నష్టం కలిగే అవకాశం ఉందంట.

నెమలి ఈక: శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. పూజా స్థలంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో నెమలి ఈకలను ఉంచడం ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

శాలిగ్రామం: పరమ శివుడిని లింగాకారంలో పూజించిన మాదిరిగానే.. శ్రీమహావిష్ణువును శాలిగ్రామంగా పూజిస్తారు. ఆ కారణంగా శాలిగ్రామాన్ని పూజా స్థలంలో ఉంచడం చాలా శ్రేయస్కరం. తన భర్తను పూజాగదిలో ప్రతిష్టించి పూజిస్తే.. లక్ష్మిదేవి ప్రసన్నం కలుగుతుందని నమ్మకం.

శంఖం: ఇంట్లో నిత్యం శంఖం ఊదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం కూడా పేర్కొంటోంది.

గంగాజలం: హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర నదీజలం ఎప్పుడూ చెడిపోదని నమ్మకం, పైగా నిరూపితం కూడా. ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచడానికి కారణం ఇదే. ఇలా చేయడం వల్ల లక్ష్మి దేవి సంతోషిస్తుందని నమ్మకం.





























