- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti to become rich in short time follow these lessons of chanakya in telugu
Chanakya Niti: మీరు ఆర్ధికంగా ఎదగలా, ధనవంతులు కావాలా చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను ప్రస్తావించాడు, దీని ప్రకారం ఒక వ్యక్తి త్వరగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతాడు. అవసరమైన సమయంలో మీరు ఇతర వ్యక్తుల ముందు చేయి చాచాల్సిన అవసరం లేదు.
Updated on: Apr 24, 2023 | 1:47 PM

విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.

ప్రేమ- ఆప్యాయత: పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తించేలా తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వరాదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. పిల్లలు తప్పు చేస్తే.. తల్లిదండ్రులు అప్పుడే వారిని మందలించాలి. వారికి తప్పు ఒప్పుల గురించి అర్థం చేసుకునేలా వివరించాలి.

భర్త, భర్తలు ఇద్దరూ ఒకరినొకరు అబద్దాలు చెప్పుకుంటుంటే.. ఆ బంధంలో బీటలు ఏర్పడతాయి. ఒకొక్కసారి ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు. కనుక భార్య, భర్తల మధ్య ఏ సమస్య వచ్చినా ఒకరితోనొకరు మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు.

తల్లిదండ్రులు మాత్రమే పిల్లల జీవితాన్ని బాగు చేయగలరని చాణక్యుడు చెప్పాడు. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల జీవితం గాడి తప్పుతుంది. అజాగ్రత్త తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారిని తమ పిల్లలకు శత్రువులుగా మారుస్తాయి.

ఒక వ్యక్తి తన స్వభావాన్ని తెలియజేసేది మాట. కనుక అతని మాటలో ఎల్లప్పుడూ మర్యాద ఉండాలని చాణక్యుడు నమ్మాడు. మధురంగా మాట్లాడే వ్యక్తులు త్వరగా విజయం సాధిస్తారు. అదే సమయంలో ఏ వ్యక్తి అయినా కోపంగా, చెడుగా మాట్లాడితే వారిని ఎవరూ ఇష్టపడరు. అటువంటి వ్యక్తులతో సంబంధం కలిగి ఉండటానికి ఎవరూ ఇష్టపడరు లేదా వారితో మాట్లాడటానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో వారి జీవితంలో వచ్చిన అవకాశాలు చేజారి పోతాయి. జీవితంలో అలాంటి వారు ఎటువంటి విజయాన్ని సాధించలేరు.




