- Telugu News Photo Gallery Spiritual photos TTD IT wing cautions devotees against fake website, lodges complaint with cyber cell Telugu News
Tirumala: తిరుమల శ్రీవారికి భక్తులకు కీలక అలెర్ట్.. అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచన
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నను దేశవిదేశాల్లోని వివిధ ప్రాంతాలలో ఉన్న భక్తులు కొలుచుకుంటారు. తిరుమల శ్రీవారిని నిత్యం వేల మంది దర్శించుకుని తన్మయత్వానికి లోనవుతారు. ఎన్నిసార్లు చూసినా తనివితీరని దివ్యమంగళ రూపం ఆయనది. భక్తుల కోర్కెలు తీర్చే వెంకన్నకు వచ్చే కానుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Updated on: Apr 23, 2023 | 2:56 PM

అయితే వెంకన్న భక్తలే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్నారు కొందరు దుండగులు. టోకెన్ల కోసం, సమాచారం కోసం, విరాళాల ఇచ్చేందుకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను నిత్యం లక్షల మంది సందర్శిస్తారు.

ఈ క్రమంలో కొందరు నకిలీ వెబ్ సైట్లను ప్రారంభించి.. భక్తులను మాయ చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాజాగా భక్తులకు సూచించింది టీటీడీ.

TTD

ఆ ఫేక్ వెబ్‌సైట్‌ను నమ్మి మోపోవద్దని భక్తులను టీటీడీ కోరింది. ఇలాంటి పనులు చేసేవారి ఆట కట్టించేందుకు విజిలెన్స్ టీమ్ రంగంలోకి దిగిందని.. పోలీసులకు కూడా కంప్లైంట్ చేసినట్లు వివరించింది. ఐటీ విభాగం నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించి తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్ కూడా నకిలీ వెబ్‌సైట్‌పై విచారణ చేపట్టింది.

TTD అధికారిక వెబ్‌సైట్‌లోనే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అలానే అధికారిక యాప్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇప్పటివరకు టీటీడీ పేరుతో ఉన్న 41 నకిలీ వెబ్‌సైట్లపై పోలీసులకు కంప్లైంట్ చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.





























