- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in telugu to become favorite of all follow these tips of acharya chanakya
Chanakya Niti: మీరు ప్రతి ఒక్కరికీ నచ్చాలనుకుంటున్నారా.. చాణక్యుడి చెప్పిన ఈ విషయాలను పాటించండి
మనిషి జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు ఆచార్య చాణక్యుడి విధానాల్లో పేర్కొన్నాడు. వాటిని అనుసరించిన వ్యక్తికీ సమాజంలో గౌరవం పెరుగుతుంది. అతను జీవితంలో పురోగతి సాధించడమే కాకుండా కోరుకున్న విజయాన్ని కూడా సాధిస్తాడు.
Updated on: Apr 25, 2023 | 1:00 PM

ఆచార్య చాణక్యుడి విధానాలు ఎంత ప్రభావవంతం అంటే ఒక సాధారణ పిల్లవాడిని అంటే చంద్రగుప్తుడిని చక్రవర్తిగా చేసాడు. చాణక్యుడి విధానాలు నేటి సమాజంలోని ప్రజలు అనుసరణీయంగా పరిగణించబడుతున్నాయి. జీవితంలో ఆశించిన విజయాన్ని పొందడానికి, సమాజంలో మీ గౌరవాన్ని పెంచుకోవడానికి ఈ విధానాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మీరు ఇంట్లో లేదా సమాజంలో అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారాలనుకుంటే చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి.

విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.

ఆచార్య చాణక్యుడు ప్రకారం మనిషికి జ్ఞానం అనేది ఒక ఆయుధం. ఎంత కష్టతరమైన గోడను కూడా జ్ఞానంతో బద్దలు కొట్టి విజయం సాధించవచ్చు. జ్ఞానాన్ని మించిన మిత్రుడు లేడని అంటారు. దీని కారణంగా ఒక వ్యక్తి విజయం సాధిస్తాడు. ఇది మీ గౌరవానికి కూడా కారణం అవుతుంది. జ్ఞానం మీ జీవితాంతం మీతోనే ఉంటుంది.

ప్రేమ- ఆప్యాయత: పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తించేలా తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వరాదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. పిల్లలు తప్పు చేస్తే.. తల్లిదండ్రులు అప్పుడే వారిని మందలించాలి. వారికి తప్పు ఒప్పుల గురించి అర్థం చేసుకునేలా వివరించాలి.

ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి చిహ్నం. కనుక వ్యక్తికీ నైపుణ్యం చాలా ముఖ్యం. పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ విజ్ఞత అవసరం. లేకపోతే, వారు సులభంగా అనేక సమస్యలలో చిక్కుకుంటారు. చాణక్యుడు ప్రకారం, మనిషి చెడు సమయాల్లో కూడా తన స్వభావాన్ని మార్చుకోకపోతే, అతను ఎల్లప్పుడూ కష్టాలను అనుభవించవలసి ఉంటుంది.




