Vastu Tips For Money: డబ్బు లెక్కించేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకండి, లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది.

హిందూమతంలో, లక్ష్మీ దేవిని సంపదకు చిహ్నంగా భావిస్తారు. లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సంపదలకు ఎలాంటి లోటు ఉండదని నమ్ముతుంటారు.

Vastu Tips For Money: డబ్బు లెక్కించేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకండి, లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది.
Vastu Tips
Follow us
Madhavi

| Edited By: Basha Shek

Updated on: Apr 28, 2023 | 10:20 AM

హిందూమతంలో, లక్ష్మీ దేవిని సంపదకు చిహ్నంగా భావిస్తారు. లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సంపదలకు ఎలాంటి లోటు ఉండదని నమ్ముతుంటారు. అంతేకాదు లక్ష్మీదేవికి కోపం వస్తే, ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. లక్ష్మీదేవి శుభ్రమైన ప్రదేశంలో నివసిస్తుంది. నిత్యం గొడవలు, పరిశుభ్రత పాటించని ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండేందుకు అంగీకరించదు. ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్తుంది. ఫలితంగా పేదరికాన్ని ఎదుర్కొవల్సి వస్తుంది.

అయితే తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాం. దాని వెనక కారణం తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని వాస్తు శాస్త్రం పేర్కొంంది. డబ్బు విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఓ సారి తెలుసుకుందాం.

– వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు డబ్బును ఉంచే పర్సులో ఆహార పదార్థాలను ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల డబ్బును అవమానించినట్లవుతుంది.

ఇవి కూడా చదవండి

-పేదవారికి లేదా ఏదైనా దానధర్మాలు చేసేటప్పుడు గౌరవంగా డబ్బు ఇవ్వాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. బాధతో డబ్బును దానం చేయకూడదు. ఇలా చేస్తే మీరు దానం చేసిన ఫలితం కూడా దక్కదు.

-వాస్తు శాస్త్రం ప్రకారం, డబ్బును లెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది చేతికి ఉమ్మివేసి డబ్బును లెక్కిస్తుంటారు. చాలా పొరపాటని గ్రహించాలి. ఇలా చేయడం లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుంది. నోట్లను లెక్కించేటప్పుడు నీరు లేదా ఏదైనా పౌడర్ ను వాడాలి.

-డబ్బును ఎప్పుడూ కూడా మంచం మీద ఉంచకూడదని గుర్తుంచుకోండి. అంతేకాదు తలగడ కిందకూడా డబ్బును ఉంచకూడదు. ఇవి శుభ్రమైన ప్రదేశాలు కావు. డబ్బును ఎప్పుడూ కూడా ఖజానాలోనే ఉంచడం శుభప్రదం. ఇలా చేస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

-వాస్తు శాస్త్రం ప్రకారం, లక్ష్మీదేవి డబ్బులో నివసిస్తుంది, కాబట్టి మీరు రోడ్డుపై లేదా ఎక్కడైనా డబ్బులు దొరికినట్లయితే వాటిని తీసుకుని నుదిటిపై మొక్కడం మర్చిపోవద్దు.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).