Astro Tips: కూర్చుని పాదాలు కదుపుతున్నారా.. అనారోగ్యం, డబ్బు ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే.
పాదాలను కదిలించడం అశుభం. ఈ అలవాటు ఆరోగ్యంతో పాటు సంపదపై చెడు ప్రభావం చూపుతుందని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూర్చున్న సమయంలో పాదాలను కదిలించడం ఎందుకు అశుభమో ఈరోజు తెలుసుకుందాం.. పాదాలు ఊపడం వలన జరిగే నష్టాల గురించి తెలుసుకున్న తర్వాత.. ఎవరైనా సరే ఈ అలవాటును వదిలివేస్తారు.
చాలామంది కూర్చున్న సమయంలో తమ పాదాలను నిరంతరం కదిలిస్తూనే ఉంటారు. ఈ అలవాటు చాలామందిలో ఉంటుంది. అయితే ఇలా చేయడంవలన ఇంటికి మంచి కాదంటూ ఆ ఇంటి పెద్దవారు వారిస్తూ ఉండడం అందరికి తెలిసిందే.. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ విధంగా పాదాలను కదిలించడం అశుభం. ఈ అలవాటు ఆరోగ్యంతో పాటు సంపదపై చెడు ప్రభావం చూపుతుందని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూర్చున్న సమయంలో పాదాలను కదిలించడం ఎందుకు అశుభమో ఈరోజు తెలుసుకుందాం..
పాదాలు ఊపడం వలన జరిగే నష్టాల గురించి తెలుసుకున్న తర్వాత.. ఎవరైనా సరే ఈ అలవాటును వదిలివేస్తారు.
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచం మీద లేదా ఎత్తైన ప్రదేశంలో కుర్చీపై కూర్చుని వేలాడుతున్న తమ కాళ్ళను నిరంతరం కదిలిస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన మీ జాతకంలో చంద్రుడు బలహీనపడతాడు. మానసిక ఆందోళనకు గురవుతారు.
- చంద్రుని అశుభ ప్రభావం వల్ల ఏ పని చేపట్టినా శాంతి ఉండదు. ఈ వ్యక్తి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. కూర్చొని పాదాలను నిరంతరం కదపడం వల్ల కూడా లక్ష్మీదేవి కి కోపం వస్తుంది. అనుగ్రహం కలుగదు అని విశ్వాసం.
- డబ్బు ఖర్చు పెరిగి పేదరికం పెరుగుతుంది. భోజనం చేసేటప్పుడు కూడా పాదాలు కదిలిస్తే అన్నపూర్ణ తల్లికి కోపం వచ్చి ఇంట్లో ధన, ధాన్యాల కొరత ఏర్పడుతుంది. పూజ చేసేటప్పుడు పాదాలను నిరంతరం కదిలిస్తే పూజ ఫలం లభించదు.
- పాదాలను కదిలించే అలవాటు వ్యక్తి మానసిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కనుక అటువంటి పరిస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించలేడు. మనోబలం తగ్గుతుంది. వైద్య శాస్త్రంలో కూడా కాళ్లను కదిలించే అలవాటును రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు.
- ఇది తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి కారణంగా, గుండె, కిడ్నీ , పార్కిన్సన్ వంటి సమస్యలు కూడా పెరుగుతాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).