Tuesday Puja Tips: అప్పులతో తిప్పలు పడుతున్నారా.. మంగళవారం ఈ నివారణలు చేసి చూడండి.. శుభ ఫలితాలు మీ సొంతం
రామ భక్త హనుమాన్ ని పూజించడం వలన జాతక దోషాలు తొలగడమే కాదు కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. ప్రతి మంగళవారం హనుమంతుడిని కొన్ని ప్రత్యేక చర్యలతో పాటు పూజించాలి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరైనా అప్పులతో ఇబ్బంది పడుతుంటే మంగళవారం కొన్ని పరిహారాలు చేసి చూడండి..
హిందూ మతంలో మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. హనుమంతుడిని హిందూమతంలో సంకట మోచనుడు అని కూడా అంటారు. హనుమంతుడి అనుగ్రహం లభించిన భక్తుడి అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. జీవితంలో ఆనందం వర్షిస్తుంది. హనుమంతుని ఆశీర్వాదం కోసం మంగళవారం రోజున పూర్తి ఆచారాలతో పూజిస్తారు. అంతేకాదు ఎవరైనా అప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. అప్పుల నుంచి బయటపడాలంటే ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడంతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు చేయాలి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మంగళవారం రుణ విముక్తి కోసం చేయాల్సిన పరిహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
మంగళవారం చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే
- రుణ విముక్తి కోసం మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని పూజ చేసి అనంతరం మల్లెపూల నూనెతో దీపం వెలిగించండి. తర్వాత ఆలయంలో కూర్చుని హనుమాన్ చాలీసా చదవండి. అంతే కాకుండా హనుమాష్టకం పఠించడం వల్ల మరింత మేలు జరుగుతుంది.
- ఇలాంటి పరిహారాలు చేయడం వలన హనుమంతుడు తన భక్తుడిని సన్మార్గంలో నడిపిస్తాడని .. భక్తుడికి వచ్చే కష్టాలన్నింటినీ తొలగిస్తాడని నమ్ముతారు.
- చేపట్టిన పనిలో విజయం సాధించాలనుకునే వారికి .. లేదా ఉద్యోగం కోసం వెదుకుతున్న వారికి మంగళవారం చేసే పరిహారాలు కూడా చాలా ఫలవంతంగా ఉంటాయి. ప్రతి మంగళవారం హనుమంతునికి అన్నం, పెరుగు నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని మీరే తీసుకోవాలి. ఇలా చేయడం వలన కోరిన కోరికలు నెరవేరతాయని నమ్మకం.
- మంగళవారం రోజున హనుమంతుడిని పూజించి ‘ఓం హనుమతే నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అంతేకాదు మంగళవారం ఉపవాసం ఉండటం వల్ల హనుమంతుని ప్రత్యేక ఆశీర్వాదాలు భక్తులకు లభిస్తాయి.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.