Tirumala: ఓ వైపు భారీ వర్షం.. తిరుమల ఘాట్ రోడ్డుపై యువకుల ఓవర్ యాక్షన్.. భక్తులు సీరియస్

Tirumala Tirupati News: తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రం.. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ ప్రదేశాన్ని ఇలా వైకుంఠంగా భావిస్తారు. ఏడు కొండల మీద కొలువైన కోనేటిరాయుడిని దర్శించుకోవడానికి భక్తులు భక్తి శ్రద్దలతో వెళ్తారు. శ్రీనివాసుడి దర్శనం కోసం మెట్ల మార్గంలోనే కాదు వాహనాలల్లో ఘాట్ రోడ్డుమీద కూడా ప్రయాణించి తిరుమల క్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే తాజాగా తిరుమల ఘాట్ రోడ్డుమీద ఓ ఆకతాయి బృందం నానా హంగామా చేసింది. తోటి భక్తులకు ఇబ్బందులకు గురి చేసింది.

Tirumala: ఓ వైపు భారీ వర్షం.. తిరుమల ఘాట్ రోడ్డుపై యువకుల ఓవర్ యాక్షన్.. భక్తులు సీరియస్
Youth Hulchul In Ghat Road
Follow us
Raju M P R

| Edited By: TV9 Telugu

Updated on: Dec 05, 2024 | 2:07 PM

తిరుమల ఘాట్ రోడ్డు లో యువకులు నానా హంగామా సృష్టించారు. ఓ వైపు తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంటే.. ఈ యువకుల బృందం చేసిన హంగామాతో వాహనదారులను ఇబ్బందులకు గురి చేసింది. తిరుపతి నుంచి తిరుమల క్షేత్రానికి వెళ్లే రెండో ఘాట్ లో కారులో ప్రయాణిస్తున్న యువకులు కారు డోర్స్, రూప టాప్ తెరచి బయటకు వచ్చి కేరింతలు కొడుతూ విన్యాసాలు చేశారు. సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ వాహనంలో దూసుకెళ్ళారు. ఒక వైపు వర్షం కురుస్తుండగా ఘాట్ రోడ్ లో ప్రమాదకరంగా ప్రయాణం సాగించారు. ఈ యువకుల చర్యలతో ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకానొక సమయంలో ఆ యువకుల కారు ఎక్కడ అదుపు తప్పుతుందో అని భయబ్రాంతులకు గురయ్యారు. వారి వాహనం అదుపుతప్పి ఇతర వాహనాలపై ఎక్కడ దూసుకొస్తుందోనని తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

తెలంగాణ కు చెందిన TS 08 JZ 6003 వాహనం రూఫ్ టాప్ ఓపెన్ చేసి కారు 4 డోర్లు తీసి వేలాడుతూ కేకలు వేస్తూ ప్రయాణం సాగించారు. యువకుల ఉత్సాహం ఘాట్ రోడ్డులో వెళ్లే ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించింది. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండగా ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించేలా యువకులు హల్ చల్ చేశారు. ఈ వ్యవహారం టీటీడీ దృష్టికి చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ సిబ్బంది ఈ ఘటనపై ఆరా తీసింది. తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదకరంగా సెల్ఫీలు తీసుకున్న యువకులపై చర్యలు తీసుకున్నారు. రెండో ఘాట్ రోడ్డులో కారు రూఫ్ టాప్, డోర్స్ కు వేలాడుతూ సెల్ఫీ లు తీసుకున్న యువకులను గుర్తించారు.

ఇవి కూడా చదవండి

వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తూ వాహనంలో ప్రయాణించిన ఆరుగురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నందకం గెస్ట్ హౌస్ వద్ద యువకుల వాహనాన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తిరుమల 2 టౌన్ పోలీసులకు అప్పగించారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదకర విన్యాసాలు చేయకూడదని, అతివేగం ప్రమాదకరమని.. ధార్మిక క్షేత్రం లో విచ్చలవిడిగా ప్రవర్తించడం పద్ధతి కాదని ఆ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమించడంతో చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..