AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకర్షణీయమైన ప్యాకేజీలకు ఆకర్షితులయ్యారో.. గోవిందా! విహార యాత్రల పేరుతో నయా దందా

టూర్స్ ట్రావెల్స్ ప్యాకేజీల పేరుతో ఈమధ్య కాలంలో దేశ వ్యాప్తంగా భారీ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇప్పటికే పలు చోట్ల వందల సంఖ్యలో అమాయకులను మోసం చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ, నోయిడా లోనూ ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

ఆకర్షణీయమైన ప్యాకేజీలకు ఆకర్షితులయ్యారో.. గోవిందా! విహార యాత్రల పేరుతో నయా దందా
Travel Fraud Scam
Surya Kala
|

Updated on: Dec 02, 2024 | 9:10 AM

Share

స్పెషల్ హాలిడే ప్యాకేజీ.. ఆకర్షణీయమైన ఆఫర్‌.. మంచి తరుణం మించిన తొరదకదు. షో.. ఈక్షణమే బుక్ చేసుకోండి. ఆల్రెడీ 90పర్సెంట్ సీట్లు బుక్‌ అయ్యాయి.. ఇంకా ఆలస్యమయ్యారో గోల్డెన్‌ ఛాన్స్ మిస్‌ అవుతారు. ఇలాంటి బురిడీ మాటలకు అట్రాక్ట్ అయ్యారో.. అడ్డంగా బుక్‌ అవుతారు. జోబులు ఖాళీ చేసి.. రోడ్డున పడేస్తారు.

 500 మందిని మోసం చేసిన శ్రీ గాయత్రి టూర్స్‌ & ట్రావెల్స్‌

ఆకర్షణీయమైన ట్రావెల్ ప్యాకేజీలకు అట్రాక్ట్ అయ్యారో.. నిలువునా మోసపోతారు. దేశంలో యాత్రల పేరుతో పెద్ద దందానే నడుస్తోంది. దేశంలో టూర్స్ ట్రావెల్స్ ప్యాకేజీల గుట్టు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. మొన్న నోయిడాలో ఓ కంపెనీ మోసం చేయగా.. ఇలాంటి ఘటనే ఇప్పుడు మన హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్‌ ఉప్పల్‌లోని శ్రీ గాయత్రి టూర్స్‌ & ట్రావెల్స్‌ యాత్రల పేరుతో 500 మందికి కుచ్చు టోపీ పెట్టింది. స్పెషల్ ఆఫర్స్‌ పేరుతో ఒక్కొక్కరి నుంచి 3వేల రూపాయలు వసూలు చేశారు. నిర్వాహకుడు భరత్ శర్మ.. 500 మంది నుంచి సుమారు 10కోట్లకు పైగా వసూలు చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని ఉప్పల్ పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీ గాయత్రి టూర్స్‌ & ట్రావెల్స్‌ నిర్వాహకుడు భరత్‌ శర్మను అరెస్ట్‌ చేశారు. రిమాండ్‌కు తరలించారు. దీనిపై ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై ఆరా తీస్తున్నారు.

నోయిడాలో కంట్రీ హాలిడే ట్రావెల్ ఇండియా ఘరానా మోసం

ఇలాంటి ఘటనే నోయిడాలో చోటుచేసుకుంది. కంట్రీ హాలిడే ట్రావెల్ ఇండియా పేరుతో కంపెనీ ఏర్పాటు చేసిన ఓముఠా.. దక్షిణాది యాత్రికులు లక్ష్యంగా మోసాలకు పాల్పడుతోంది. రెండేళ్లుగా వందలాది మంది కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని నయా దందా చేస్తోంది. కస్టమర్ల నుంచి డబ్బులు స్వీకరించాక.. ముఠా కనిపించకుండా పోవడం లేదా ఆలస్యంగా రెస్పాండ్ కావడం చేస్తోంది. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసిన పోలీసులు కంట్రీ హాలిడే ట్రావెల్ ఇండియా మోసాలను గుట్టురట్టు చేశారు.

ఇవి కూడా చదవండి

ఈకేసులో 17 మంది మహిళలతో సహా 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నోయిడాలోని సెక్టార్ 63లో నిర్వహిస్తున్న నకిలీ కాల్ సెంటర్‌ను ఛేదించారు. సోదాల్లో నాలుగు ల్యాప్‌టాప్‌లు, మూడు మానిటర్లు, మూడు ఐప్యాడ్‌లు, సహా పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది రోజుల లగ్జరీ ట్రిప్‌ పేరుతో ఆకర్షణీయమైన హాలిడే ప్యాకేజీలను అనౌన్స్ చేసి మోసం చేస్తున్నట్లు స్థానిక పోలీసులు గుర్తించారు. ప్రజలు ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించి.. ట్రావెల్స్ మోసాల భారిన పడకుండా ఉండాలని కోరుతున్నారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..