Road Accident: అంబులెన్స్‌ను వెంటాడిన మృత్యువు.. నలుగురు దుర్మరణం..!

దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అజాగ్రత్తగా వాహనాలు నడపడం, ఓవర్‌టెక్‌, మద్యం తాగి నడపడం, అతివేగం తదితర కారణాల వల్ల ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో బలవుతున్నారు. తాజాగా..

Road Accident: అంబులెన్స్‌ను వెంటాడిన మృత్యువు.. నలుగురు దుర్మరణం..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 01, 2024 | 10:17 PM

దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అజాగ్రత్తగా వాహనాలు నడపడం, ఓవర్‌టెక్‌, మద్యం తాగి నడపడం, అతివేగం తదితర కారణాల వల్ల ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో బలవుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా నుంచి బిహార్‌కు వెళ్తున్న ఓ అంబులెన్స్‌కు ప్రమాదం చోటు చేసుకుంది. అనిష్‌ షా (18) అనే రోగిని కర్నూలు నుంచి బీహార్‌లోని చంపారన్‌లో తమ స్వగ్రామానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఆదివారం ఉదయం ఓ పాదచారుడిని ఢీకొట్టిన అంబులెన్సు.. ఆ తర్వాత స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. జబల్‌పుర్‌ -నాగ్‌పుర్‌ హైవే (ఎన్‌హెచ్‌ 34)పై చోటు చేసుకుంది.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో అంబులెన్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు అనిష్‌ షా కుటుంబ సభ్యులు ఆరుగురు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో పాదచారుడిపైకి దూసుకెళ్లిన అంబులెన్సు.. ఆ తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతులు ప్రమిత షా (35), ప్రిన్స్‌ షా (4), ముకేశ్‌ షా (36), సునీల్‌ షా (41)గా గుర్తించారు పోలీసులు. గాయాలైన వారికి చికిత్స నిమిత్తం జబల్‌పుర్‌ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి