Monday Puja Tips: శివయ్య అనుగ్రహం కోసం సోమవారం ఈ చర్యలు చేసి చూడండి..

హిందూ మతంలో సోమవారం శివునికి అంకితమైనది రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున మహాదేవునికి ప్రత్యేక పూజలు చేసి శివుని అనుగ్రహం కోసం ఉపవాసం పాటిస్తారు. కోరిన కోరికను నెరవేర్చమంటూ భోలాశంకరుడిని ప్రార్ధిస్తారు. ఈ రోజు శివుడి అనుగ్రహం కోసం సోమవారం పాటించాల్సిన కొన్ని ఖచ్చితమైన చర్యల గురించి తెలుసుకుందాం..

Monday Puja Tips: శివయ్య అనుగ్రహం కోసం సోమవారం ఈ చర్యలు చేసి చూడండి..
Lord Shiva Puja
Follow us
Surya Kala

|

Updated on: Dec 02, 2024 | 7:15 AM

సనాతన ధర్మంలో వారంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకి అంకితం చేయబడింది. అదేవిధంగా సోమవారం రోజున శివుడు తనను ఆరాధించే భక్తుడు కోరిన ప్రతి కోరికను తీర్చే రోజు. మీకు కూడా ఏదైనా నెరవేరని కోరిక ఉంటే.. అది నెరవేరాలని కోరుకుంటే, ఖచ్చితంగా సోమవారం రోజున శివునికి ఈ ప్రత్యేక నివారణలను ప్రయత్నించండి. ఈ చర్యలను అనుసరించడం ద్వారా భక్తుడి సమస్యలు ఖచ్చితంగా పరిష్కారమవుతాయని నమ్ముతారు.

మహాదేవుడు సోమవారాన్ని ఇష్టపడతాడని మత విశ్వాసం. ఈ రోజున శివయ్యతో పాటు తల్లి పార్వతిని పూజిస్తారు. అంతేకాకుండా సోమవారం ఉపవాసం కూడా పాటిస్తారు. సోమవారం వ్రతం పాటించడం ద్వారా కోరుకున్న వధువు/వరుడు లభిస్తారని నమ్ముతారు. ఎవరైనా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటి నుంచి బయటపడాలనుకుంటే లేదా మరేదైనా సమస్య ఉన్నట్లయితే ఖచ్చితంగా సోమవారం క్రింద పేర్కొన్న చర్యలను చేయండి.

సోమవారం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే

ఇవి కూడా చదవండి

వ్యాపారంలో నిరంతరం డబ్బు కొరత లేదా నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే, మనోబలం తగ్గిపోతుంటే ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు 2 తెల్లని పువ్వులను మీతో ఉంచుకోండి. పని పూర్తయిన తర్వాత వాటిని ప్రవహిస్తున్న నీటిలో కలపండి.

ఎవరైనా శత్రువుల వల్ల ఇబ్బంది ఉంటే శత్రుడు నుంచి బయటపడటానికి సోమవారం స్నానం చేసిన తర్వాత శివుని ముందు నెయ్యి దీపం వెలిగించండి. అలాగే శివుని మంత్రం ఓం శం శం శివాయ షం కురు కురు ఓం అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి.

జీవితంలో ఎప్పటి నుంచో సమస్య ఎదురవుతూ.. అది పరిష్కారం అవ్వకపోతుంటే.. కొన్ని చుక్కల పాలను నీటిలో కలిపి సోమవారం శివలింగానికి సమర్పించండి. అలాగే 11 బిల్వ పత్రాలను తీసుకుని ఆ ఆకులపై చందనంతో ఓం అని రాసి శివలింగానికి సమర్పించండి. తరువాత శివలింగాన్ని ధూపం మొదలైన వాటితో పూజించాలి.

ఆదాయం పెరగాలంటే సోమవారం రోజున శివలింగానికి పాలు సమర్పించండి. వీలైతే ఆవు పాలతో పూజ చేయండి. శివలింగానికి పాలు సమర్పించేటప్పుడు ఓం నమః శివాయ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆదాయం పెరగడానికి శివుడిని కొరుతూ ప్రార్థించండి.

ఇంట్లో అసమ్మతి ఉంటే దాని కారణంగా మీ మనస్సు కలత చెందితే, సోమవారం ఉపవాసం చేయడం మంచిది. సమీపంలోని శివాలయంలోని శివునికి బిల్వపత్రాన్ని సమర్పించండి. అవసరమైన వ్యక్తికి బియ్యాన్ని దానం చేయండి.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.