Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటికీ సైన్స్‌కు సవాల్ ఈ శివాలయం.. గడ్డ కట్టే చలిలో కూడా మరిగే నీరు.. ఎక్కడ ఉందంటే..?

భారతదేశంలో నేటికీ సైన్స్ కు, మానవ మేథస్సుకు సవాల్ చేసే అనేక రహస్య ప్రదేశాలు, ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి శివాలయం. ఇక్కడ తీవ్రమైన చలిలో అంటే గడ్డ కట్టే చలిలో కూడా నీరు మరుగుతూ ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన మర్మమైన కథ ఏమిటో తెలుసుకుందాం?

నేటికీ సైన్స్‌కు సవాల్ ఈ శివాలయం.. గడ్డ కట్టే చలిలో కూడా మరిగే నీరు.. ఎక్కడ ఉందంటే..?
Manikaran Hot Spring
Follow us
Surya Kala

|

Updated on: Nov 29, 2024 | 10:35 AM

భారతదేశంలో శివునికి సంబంధించిన అనేక పురాతన, అద్భుత ఆలయాలు ఉన్నాయి. ఈ శివాలయాలన్నింటిలో వివిధ రకాల రహస్యాలు, అద్భుతాలు చూడవచ్చు. కొన్ని దేవాలయాలలో శివలింగం సంవత్సరానికి పెరుగుతూ ఉంటుంది. కొన్ని శివాలయంలో ఇది కలియుగ ముగింపును సూచిస్తుంది. అలాంటి రహస్య శివాలయంలో ఒక ఆలయంలో చలిలో కూడా నీరు మరుగుతూనే ఉంటుంది. ఇది నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇది ఇప్పటి వరకు ఈ రహస్యాన్ని ఏ శాస్త్రవేత్త కూడా కనుగొనలేకపోయారు. ఈ ఆలయానికి, ఇక్కడ వేడినీటికి సంబంధించిన శివుని కథ ప్రసిద్ధి చెందింది. ఈ రహస్య దేవాలయం ఎక్కడ ఉంది? దీని కథ ఏమిటో తెలుసుకుందాం?

ఈ ఆలయం ఎక్కడ ఉంది?

ఈ రహస్యమైన శివుని ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కులుకి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణికరణ్‌లో ఉంది. ఇది హిందూ, సిక్కు మతాలకు సంబంధించిన చారిత్రాత్మకమైన ప్రదేశం. పార్వతి నది మణికర్ణ గుండా ప్రవహిస్తుంది. దీనికి ఒక వైపు శివాలయం, మరొక వైపు మణికర్ణ సాహిబ్ అని పిలువబడే గురు నానక్ కి చెందిన చారిత్రక గురుద్వారా ఉంది. ఇక్కడ వేడి నీరు ఇప్పటికీ ఒక రహస్యం. ఈ రహస్యంపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. అయినా రహస్యం తెలుసుకోలేకపోయారు.

పురాణ కథ ఏమిటి?

ఈ శివాలయానికి సంబంధించిన కథ చాలా ప్రాచుర్యం పొందింది. శివుడి భోలాశంకరుడు. అయితే శివుడికి ఆగ్రహం వస్తే ఎవరూ అతని నుంచి తప్పించుకోలేరు. పురాణ కథ ప్రకారం ఒకసారి నదిలో పార్వతీదేవి ఆడుతుండగా అమ్మవారి చెవిపోగు ముత్యం నీటిలో పడిపోయింది. ప్రవహిస్తున్న నది నీటి నుంచి ఆ ముత్యం భూలోకం నుంచి పాతాళానికి చేరుకుంది. ఆ తర్వాత శివుడు తన గణాలను ఆ ముత్యం కోసం వెతకడానికి పంపాడు. ఎక్కడ ఎంత వెతికినా వారికి ఆ ముత్యం దొరకలేదు. దీంతో శివుడు కోపించి భయంకరమైన దూరం దాల్చి మూడో కన్ను తెరిచాడు. మహాదేవుని కోపము వలన నదిలో నీరు మరగడం మొదలైంది. ఆ నది నీరు అది నేటికీ అలా మరుగుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

శివుని ఈ భయంకరమైన రూపాన్ని చూసి నైనా దేవి ప్రత్యక్షమై పాతాళానికి వెళ్లి శేషనాగుడిని పార్వతి దేవి ముత్యాన్ని శివునికి తిరిగి ఇవ్వమని కోరింది. ఆ తర్వాత శేషుడు పార్వతిదేవి ముత్యాన్ని మహ దేవుడికి తిరిగి ఇచ్చాడు. శేషుడు పాతాళంలో బిగ్గరగా బుసలు కొట్టాడు. అప్పుడు అనేక రత్నాలు భూమిపైన వివిధ ప్రదేశాలలో పడ్డాయి. అప్పుడు పార్వతీ దేవికి సంబంధించిన రత్నాన్ని తీసుకుని.. శివుడు ఆ రత్నాలన్నింటినీ రాళ్ళుగా మార్చి నదిలో విసిరాడు.

వేడి నీటితో ఆహారం తయారీ

ఒకవైపు పార్వతి నదిలో గడ్డకట్టే నీరు, మరోవైపు మరుగుతున్న వేడి నీటి బుగ్గ ప్రతి సందర్శకుడిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ దైవిక దృగ్విషయం చూసిన నాస్తికుడు కూడా దేవునికి తల వంచాల్సిందే అని సందర్శకులు చెబుతారు. ఈ ఆలయ సందర్శన ప్రతి భక్తునికి మానసిక, ఆధ్యాత్మిక సంతృప్తిని అందిస్తుంది. శీతాకాలంలో మంచు కురుస్తుంది.. వేసవిలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

పురాతన కాలం నుంచి ఇక్కడ మరుగుతున్న నీటి బుగ్గలు 10 నుంచి 15 అడుగుల ఎత్తులో ఒక ఫౌంటెన్‌ను సృష్టించాయి. కొన్నిసార్లు ఈ నీటి బుగ్గల నుంచి విలువైన వివిధ రంగు రాళ్ళు కూడా బయటకు వస్తాయి. ఈ నీటి బుగ్గల ఉష్ణోగ్రత 65 నుంచి 80 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ వెచ్చని నీటిగల కారణాన్ని అన్వేషించడంలో శాస్త్రవేత్తలు కూడా విఫలమయ్యారు. నీటిలో ఎలాంటి సల్ఫర్ ఉండదు. ఈ నీటిలో అన్నం, పప్పు, కూరగాయలు వంటి వివిధ ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి. ఈ కుండంలో స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు, ఇతర అనారోగ్యాలు నయమవుతాయి.

స్నానం చేయడం వల్ల రోగాల నుంచి ఉపశమనం

ఈ పవిత్ర జలంలో ఎవరు స్నానం చేస్తారో.. వారికి సంబంధించిన చర్మ సంబంధిత వ్యాధులు నయం అవుతాయని ప్రజలు నమ్మకం. అంతేకాదు శ్రీ రాముడు ఈ ప్రదేశంలో శివుడికి అనేక సార్లు పూజించాడని.. రాముడు తపస్సు చేశాడని నమ్ముతారు. నేటికీ శ్రీరాముని తపస్సు చేసిన మణికర్ణలో శ్రీరాముని పురాతన మరియు, గొప్ప ఆలయం ఉంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.