2025లో ఫస్ట్ సూర్యగ్రహణం ఎప్పుడు? సూతక సమయం తెలుసుకోండి.. ఈ రాశులకు లక్కే లక్కు

గ్రహణాలకు ఖగోళ దృక్కోణంలో మాత్రమే కాదు సనాతన ధర్మంలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 2025 సంవత్సరంలో సూర్య గ్రహణాలు ఎన్ని.. మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో.. సూత కాలం సమయం తెలుసుకుందాం..

2025లో ఫస్ట్ సూర్యగ్రహణం ఎప్పుడు? సూతక సమయం తెలుసుకోండి.. ఈ రాశులకు లక్కే లక్కు
Solar Eclipse
Follow us
Surya Kala

|

Updated on: Nov 29, 2024 | 9:42 AM

2024 కి గుడ్ చెప్పి.. కొత్త సంవత్సరం 2025కి వెల్కం చెప్పడానికి ఒక నెల రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో తమకు కొత్త ఏడాది అయినా మంచి జరగాలని చేపట్టిన పనులు పూర్తి కావాలని కోరుకుంటారు. అంతేకాదు మంచి చెడులను గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు. దీంతో రాబోయే సంవత్సరం తమకు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఎక్కువగా చూపుతారు. ఇది గ్రహాల జాతకం, స్థానం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ఏడాది పొడవునా ఏర్పడే సూర్య, చంద్ర గ్రహణాలు కూడా ప్రభావం చూపుతాయి.

సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందంటే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29, 2025న మధ్యాహ్నం 2:20 నుంచి సాయంత్రం 6:13 వరకు ఏర్పడుతుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఇక సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం 21 సెప్టెంబర్ 2025న జరుగుతుంది. అది కూడా పాక్షిక సూర్య గ్రహణమే.

సూత కాలం ఎప్పుడంటే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతకాల సమయం ప్రారంభమవుతుంది. ఇది గ్రహణ కాలం ముగిసిన తర్వాత ముగుస్తుంది. గ్రహణం కనిపించే ప్రదేశాలలో మాత్రమే సూత కాలం చెల్లుతుంది. సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా సూత కాలం కూడా చెల్లదు.

ఇవి కూడా చదవండి

ఏ రాశుల వారు లాభపడతారంటే

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు శుభప్రదంగా ఉంటుంది. సూర్యగ్రహణం తర్వాత కర్మఫలాలను ఇచ్చే శనీశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల మిథునం, తుల, ధనుస్సు, మీనం రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందనున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వ్యక్తుల పనులు ఆగినవి కూడా మళ్ళీ సాగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఈ రాశుల వారికి ఆరోగ్యం పరంగా కూడా మంచిది. అంతే కాదు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.