Shani Gochar 2025: వచ్చే ఏడాది శని మార్పు.. ఆ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి..!

Lord Shani Dev: వచ్చే ఏడాది మార్చి 29న కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్న శనీశ్వరుడు రెండున్నర ఏళ్లపాటు కొన్ని రాశులకు కష్టనష్టాల నుంచి విముక్తి కలిగిస్తాడు. విముక్తి కలిగించడంతో పాటు అనేక అంశాలు, రంగాల్లో ఊహించని పురోగతిని కూడా ఇస్తాడు. ఏలిన్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని వంటి శని దోషాల నుంచి విముక్తి లభించి నల్లేరు మీద బండిలా కొన్ని రాశులకు జీవితం సాగిపోతుంది.

Shani Gochar 2025: వచ్చే ఏడాది శని మార్పు.. ఆ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి..!
Shani gochar 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 28, 2024 | 7:34 PM

వచ్చే ఏడాది మార్చి 29న కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్న శనీశ్వరుడు రెండున్నర ఏళ్లపాటు కొన్ని రాశులకు కష్టనష్టాల నుంచి విముక్తి కలిగిస్తాడు. విముక్తి కలిగించడంతో పాటు అనేక అంశాలు, రంగాల్లో ఊహించని పురోగతిని కూడా ఇస్తాడు. ఏలిన్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని వంటి శని దోషాల నుంచి విముక్తి లభించి నల్లేరు మీద బండిలా కొన్ని రాశులకు జీవితం సాగిపోతుంది. ఇందులో వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులున్నాయి. ఈ రాశుల వారికి ఆదాయ వృద్ధి, ఆరోగ్యం, ఉద్యోగంలో పురోగతి, వృత్తి, వ్యాపా రాల్లో రాబడి పెరుగుదల, శుభ కార్యాలు, సమస్యల పరిష్కారం వంటివి తప్పకుండా అనుభవానికి వస్తాయి.

  1. వృషభం: ఈ రాశివారికి శని లాభ స్థానంలోకి వస్తున్నందువల్ల రెండున్నర ఏళ్ల పాటు జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుంచి, పని భారం నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపా రాలు కష్టనష్టాల నుంచి బయటపడి అభివృద్ధి బాటపడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగు తాయి. ఆదాయపరంగా అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశివారికి శని నవమ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల అష్టమ శని దోషం తొలగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించడం, కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, శుభ కార్యాలు జరగడం, ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావడం వంటివి జరుగు తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. పిత్రార్జితం లభిస్తుంది.
  3. తుల: ఇప్పటి వరకూ పంచమ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు ఆరవ స్థానమైన మీన రాశి లోకి మారడం వల్ల ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారాల్లోనూ తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందడం జరుగుతుంది. ప్రతిభకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులను చేపట్టడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది.
  4. వృశ్చికం: ఈ రాశివారికి శని పంచమ స్థానంలోకి మారడంతో అర్ధాష్టమ శని నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాలు తేలికగా నెరవేరుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుంచి, పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. కొన్ని కష్టనష్టాల వల్ల ఆగిపోయిన శుభకార్యాలు పూర్తవుతాయి.
  5. మకరం: ఇంత కాలంగా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న శని మూడవ స్థానానికి మారుతున్నందు వల్ల ఈ రాశివారికి ఏడున్నరేళ్ల శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. దీనివల్ల అనేక రాజయోగాలు, ధన యోగాలు పట్టడం, అన్ని విధాలుగానూ పురోగతి చెందడం వంటివి జరుగుతాయి. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. అధిక శ్రమ, తక్కువ లాభంతో సాగుతున్న జీవితం ఇక నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!