Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త.. 12రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 29, 2024): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. వృషభ రాశి వారు ప్రయాణాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త.. 12రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 29 November 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 29, 2024 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 29, 2024): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. వృషభ రాశి వారు ప్రయాణాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం బాగా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో విజయవంతం అవుతాయి. కొందరు బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదం నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్త అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. శుభకార్యానికి ప్లాన్ చేస్తారు. కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇతరులకు కొద్దిగా సహాయం చేయడం జరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాలలో అప్రయత్న ధన లాభం ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులకు మీ పనితీరు సంతృప్తి కలిగిస్తుంది. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపా రాలు ఆశాజనకంగా ఉంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. దూర ప్రాంతం నుంచి బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలు చదువుల్లో పురోగతి చెందుతారు. గృహ యోగానికి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు వినే అవ కాశం కూడా ఉంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గు తుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటా బయటా గౌరవాభిమానాలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఇష్టమైన మిత్రులతో సర దాగా కాలక్షేపం చేస్తారు. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో కొద్దిగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. శుభ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేయడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుం డదు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం ఆశించినంతగా వృద్ది చెందు తుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్య లను సమయస్ఫూర్తితో పరి‌ష్కరించుకుంటారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే సూచనలున్నాయి. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. రావలసిన డబ్బును ఎంతో శ్రమపడి వసూలు చేసుకుంటారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రాధాన్యం లభిస్తుంది. అధికారులకు మీ సల హాలు, సూచనలు ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలలో ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు మారే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. గృహ, వాహన ప్రయత్నాలు చాలావరకు విజయ వంతం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తయి మానసికంగా ఊరట లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగు పడుతుంది. రాజీమార్గంలో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో పని భారం బాగా పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసు కోవాలి. వ్యక్తిగత సమస్య ఒకటి తేలికగా పరిష్కారమవుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. ఊహించని విధంగా ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. కొందరు మిత్రులతో విందులో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాలను విస్తరించే ఆలోచన చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో చిన్నా చితకా సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వీలైనం తగా ఆర్థిక సమస్యలను తగ్గించుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ప్రయాణాల వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం చాలా మంచిది.

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం