AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: యువతితో కలిసి రిసార్ట్స్‌కు వెళ్లిన ఎస్ఐ.. తెల్లవారుజామున ఊహించని ఘటన..

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఓ ఎస్ఐ ప్రాణాలు విడిచిన విషాద ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. వాజేడు మండల ఎస్ఐ రుద్రారపు హరీష్ ముళ్లకట్ట వద్ద గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిదో రిసార్ట్‌లో తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Telangana: యువతితో కలిసి రిసార్ట్స్‌కు వెళ్లిన ఎస్ఐ.. తెల్లవారుజామున ఊహించని ఘటన..
Si Suicide
G Peddeesh Kumar
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Dec 02, 2024 | 10:35 AM

Share

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఓ ఎస్ఐ ప్రాణాలు విడిచిన విషాద ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. వాజేడు మండల ఎస్ఐ రుద్రారపు హరీష్ ముళ్లకట్ట వద్ద గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిదో రిసార్ట్‌లో తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఆదివారం ఎస్ఐ స్టేషన్ నుంచి వెళ్లి ఆ తర్వాత రాలేదు.. ఈ క్రమంలో ఎస్ఐ ఓ యువతితో కలిసి రిసార్ట్ కు వెళ్లారు.. ఆ తర్వాత ఉదయాన్నే ఈ ఘటన జరిగింది..

ఆదివారం బందోబస్తు అనంతరం.. ఎస్సై హరీష్ రాత్రి 9 గంటల సమయంలో యువతితో కలిసి రిసార్ట్స్ కు వెళ్లారు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆ యువతి ఎస్సైతో పాటే ఆ గదిలో ఉంది.. ఎస్ఐ గన్ తో కాల్చుకున్న తర్వాత.. ఆ యువతి పోలీసులకు సమాచారం ఇచ్చింది.. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.. ఇంతకీ ఆ యువతి ఎవరు..? అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

హరీష్‌ చనిపోయాక ఆయన మృతదేహం మీద పడి ఏడుస్తూ కనిపించింది. ఎస్ఐ ఆత్మహత్యకు పెళ్లి వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తున్నారని ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు పోలీసులు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామం.. హరీష్ మృతి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా.. వారం రోజుల క్రితం వాజేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు ఆదివాసీలను మావోయిస్టులు హతమార్చారు. ఆ ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్ లో SIగా పని చేస్తున్న హరీష్‌ ఇప్పుడు సూసైడ్‌ చేసుకోవడం సంచలనంగా మారింది.

ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో..

వాజేడు ఎస్సై సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఆయన యువతిని ప్రేమిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండడంతో మనస్థాపానికి గురైన ఎస్సై.. ఈ క్రమంలోనే ఆ యువతితో కలిసి రిసార్ట్స్ కు వెళ్లారు.. పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై గన్ తో కాల్చుకొని చనిపోయినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..