Vivaha Panchami: దంపతుల మధ్య గొడవలా.. వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజించండి.. ప్రాముఖ్యత ఏమిటంటే

వివాహ పంచమి పండుగను మార్గశిర మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున జరుపుకుంటారు. ఎందుకంటే ఈ రోజున సీతారాముల వివాహం జరిగింది. వివాహ పంచమి రోజున అరటి చెట్టు పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. అరటి చెట్టును పూజిస్తే దాంపత్య సమస్యలు దూరమవుతాయని నమ్మకం.

Vivaha Panchami: దంపతుల మధ్య గొడవలా.. వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజించండి.. ప్రాముఖ్యత ఏమిటంటే
Vivah Panchami 2024
Follow us
Surya Kala

|

Updated on: Dec 03, 2024 | 7:53 AM

హిందూ మతంలో వివాహ పంచమి వేడుకను ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజున ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ రోజున సీతారాముల వివాహం జరిగింది. దీనిని శ్రీరామ వివాహ ఉత్సవ వేడుక అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం వివాహ పంచమి శుక్రవారం డిసెంబర్ 6వ తేదీన జరుపుకోనున్నారు. ఈ వివాహ పంచమి రోజున సీతా స్వయంవరం జరిగిందని నమ్మకం. వివాహ పంచమి రోజున శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యలో సీతా దేవి జన్మస్థలం నేపాల్ లోని జనక్‌పూర్‌లలో రాముని ఊరేగింపు జరుగుతుంది. అంతేకాదు వివాహం అయిన ఐదవ రోజున అరటి చెట్టును పూజిస్తారు.

ఇంట్లో అరటి చెట్టును నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది విష్ణువు, లక్ష్మీదేవి, దేవ గురువు బృహస్పతికి సంబంధించినది. అరటిని విష్ణువుకు ఇష్టమైన చెట్టుగా భావిస్తారు. ఇంటి ప్రాంగణంలో లేదా తోటలో అరటి చెట్టును పెంచితే శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. ఇది ఇంటిలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు. వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజించడం చాలా శ్రేయస్కరం.

హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి డిసెంబర్ 05వ తేదీ మధ్యాహ్నం 12.49 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే డిసెంబర్ 06వ తేదీ మధ్యాహ్నం 12.07 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం వివాహ పంచమి పండుగ ఈ సంవత్సరం డిసెంబర్ 06 న జరుపుకొనున్నారు.

ఇవి కూడా చదవండి

అరటి చెట్టును ఎందుకు పుజిస్తారంటే..

  1. వివాహ పంచమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి.
  2. దీని తరువాత పసుపు బట్టలు ధరించి, అరటి చెట్టుకు పసుపు తాడు కట్టాలి.
  3. పసుపు, చందనంతో పాటు పుష్పాలను సమర్పించిన తరువాత ధూపం వేసి నెయ్యి దీపం వెలిగించాలి.
  4. శ్రీరాముని మంత్రాలను జపించండి, శ్రీ రాముడు విష్ణువు అవతారం.
  5. అరటి చెట్టును పూజిస్తూ లక్ష్మీనారాయణుడిని ధ్యానించండి.
  6. దీని తరువాత పంచామృతం, తమలపాకులు, అరటి పండ్లు, పువ్వులతో పూజ చేసి కొబ్బరి కాయను నైవేద్యంగా సమర్పించండి.
  7. తరువాత అరటి చెట్టుకు 21 సార్లు ప్రదక్షిణలు చేసి.. అరటి చెట్టు ముందు పెళ్లి కాని వారు పెళ్లి కుదరాలని.. దంపతుల మధ్య విబేధాలు ఉంటే అవి సమసిపోవాలని కొరుకోండి.

వివాహ పంచమి నాడు ఎందుకు పెళ్లి చేయరంటే

వివాహ పంచమి రోజున ఎంత మంచి ముహర్తాలు ఉన్నా తమ కుమార్తెలకు తల్లిదండ్రులు వివాహం చేయరు. దీని గల కారణం సీతా శ్రీరాముల వైవాహిక జీవితం గడిచిన విధానమే.. అయితే మరోవైపు వివాహ పంచమి రోజున సీతదేవి ఆశీర్వాదాలు లభిస్తాయనే మరో నమ్మకం కూడా.. అయితే వివాహ పంచమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల దాంపత్య జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. దంపతులు సుఖ సంతోషాలతో జీవిస్తారు.

వివాహ పంచమి నాడు అరటి చెట్టు ప్రాముఖ్యత

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివాహం అయిన 5వ రోజున అరటి చెట్టును పూజించడం వలన బృహస్పతి గ్రహానికి సంబంధించిన చెడులు తొలగిపోతాయి. దేవగురు బృహస్పతి జ్ఞానం, గురువు, పిల్లలు, అన్నయ్య, విద్య, మతపరమైన పనులు, పవిత్ర స్థలాలు, సంపద, దాతృత్వం,వంటి విషయాలలో ముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నాడు. వివాహంలో లేదా వారి వైవాహిక జీవితంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వ్యక్తులు… వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజించడం వల్ల భాగస్వామితో బంధం మధురంగా ఉంటుంది. బృహస్పతి ప్రతికూల ప్రభావాలను కూడా తొలగిస్తాడు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.