Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bonalu: ‘అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో..’ అంటూ భాగ్యనగరం సహా యావత్ తెలంగాణం బోనమెత్తుకుంటోంది

భాగ్యనగరం మొత్తం ఆధ్యాత్మిక కాంతుల్ని అద్దుకుంది. నాలుగు శతాబ్దాలుగా అన్ని వర్గాలను, విభిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత చారిత్రక, సాంస్కృతిక, సామూహిక ఉత్సవంతో భక్తులు పరవశించిపోతున్నారు...

Bonalu: 'అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో..' అంటూ భాగ్యనగరం సహా యావత్ తెలంగాణం బోనమెత్తుకుంటోంది
Bonalu Hyderbad
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 11, 2021 | 7:36 PM

Bonalu festival: భాగ్యనగరం మొత్తం ఆధ్యాత్మిక కాంతుల్ని అద్దుకుంది. నాలుగు శతాబ్దాలుగా అన్ని వర్గాలను, విభిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత చారిత్రక, సాంస్కృతిక, సామూహిక ఉత్సవంతో భక్తులు పరవశించిపోతున్నారు. తెలంగాణ సాంస్కృతి వైభవాన్ని ప్రతిభింభించేలా బోనాల ఉత్సవాలకు చారిత్రాత్మక గోల్కొండ కోట అందంగా ముస్తాబైంది. గతేడాది కోవిడ్ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలు ఈ సారి ఘనంగా జరుగుతున్నాయి.

సువిశాలమైన గోల్కొండ కోట ఇప్పటికే భక్తులతో కిటకిటలాడుతుంది. మొదటి పూజలో అమ్మవారికి ముందుగా నజర్ బోనం సమర్పించారు. 32 అడుగుల ఎత్తయిన భారీ తొట్టెల లంగర్‌హౌజ్‌ చౌరస్తా నుంచి ఊరేగింపుతో గోల్కొండ కోటకు.. నజర్ బోనంతో తొట్టెలో తీసుకెళ్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమయిన ఊరేగింపు రాత్రి 8గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది.

లంగర్ హౌస్ లో తొలి బోనంకి సర్వం సిద్ధం అయ్యాయి. చౌరస్తా దగ్గర తొట్టెల, అమ్మ వారి రథం ఊరేగింపు మొదలైంది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, పద్మారావు నగర్ కి చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బంగారు బోనం సమర్పించారు.

బోనాల ఉత్సవంలో ప్రతీ ఘట్టం భక్తిపూరితంగా, భావోద్వేగభరితంగా ఉంటుంది. కోటపై కొలువుదీరిన అమ్మవారిని చోటాబజార్‌లోని ఆలయ పూజారి ఇంటికి తీసుకెళ్లి అక్కడ అమ్మవారిని అలంకరించుకుని భారీ ఉరేగింపు నడుమ కోటపైకి తీసుకెళ్లి ప్రతిష్టిస్తారు. పోతరాజుల నృత్యాలు, బ్యాండు మేళాలు, భక్త కోటి కోలాహలం, తొట్టెల ఊరేగింపు కన్నులపండువగా సాగుతాయి. కోటపైకి అమ్మవారి ఉరేగింపు కాలినడకన చేరుకోవడంతో కోట మొత్తం పెద్ద జాతరనే తలపిస్తుంది.

Bonalu Talasani

Bonalu Talasani

అటు వరంగల్ లోనూ బోనాల పండుగ వైభవంగా సాగుతోంది. చల్లని తల్లి.. కోరికలు తీర్చే కొంగు బంగారం.. అష్ట దేవతల్లో ఆరంభపూజలు అందుకుంటున్న భక్తస్వరూపిని భద్రకాళి అమ్మవారు.. ప్రతి ఏటా ఆషాడమాసంలో నిర్వహించే అమ్మవారి శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భద్రకాళి అమ్మవారిని కూరగాయలతో అలంకరించి శాకంబరిగా ఆరాధిస్తున్నారు.

ఓరుగల్లులోని భద్రకాళి అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నిర్వహించిన తర్వాతే తెలుగురాష్ట్రాల్లోని దేవతామూర్తులు, దేశంలోని వేర్వేరు అదిపరాశక్తులకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ శాకంబరీ ఉత్సవాలకు కేవలం జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాలు వేరే రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. అమ్మవారు నిండు శాకంబరిగా దర్శనమిచ్చిన రోజున ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

అటు, ఇంద్రకీలాద్రీపై వైభవంగా అషాడ మాస పవిత్ర సారె మహోత్సవం ప్రారంభమైంది. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామాగ్రిని దుర్గగుడి అర్చకులు, వైదిక కమిటీ, వేద పండితులు కుటుంబసభ్యులతో కలిసి సమర్పించారు. గత ఐదేళ్లుగా ఆషాడమాసం సారె మహోత్సవం తొలి రోజున అమ్మవారికి ఆలయ అర్చకులు సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

Golkonda Bonalu

Golkonda Bonalu

Read also: Errabelli: ‘రైతులను ప్రేమించేది ఇద్దరే..! మొదటి వ్యక్తి ఎన్టీఆర్.. ఎదురు పెట్టుబడి ఇచ్చిన ఘనుడు కేసీఆర్’