Medaram: మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మృతి.. రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధుల సంతాపం
మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్, TRS సీనియర్ నాయకుడు ఆలం రామ్మూర్తి కన్నుమూశారు. ఆదివారం గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఉదయం కొద్దిపాటి అస్వస్థతకు గురైన...
మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్, TRS సీనియర్ నాయకుడు ఆలం రామ్మూర్తి కన్నుమూశారు. ఆదివారం గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఉదయం కొద్దిపాటి అస్వస్థతకు గురైన రామ్మూర్తిని ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మరోసారి గుండె పోటు వచ్చినట్లుగా తెలుస్తోంది. పస్రా గ్రామానికి సమీపంలోకి చేరుకోగానే ఆయన తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులు శోక సంద్రంలో మునిగిపోయారు.
రామ్మూర్తి ట్రస్టు చైర్మన్‌గా ఉన్న సమయంలో మేడారం అభివృద్ధికి బాటలు పడ్డాయి. అంతే కాదు మేడారం జాతర విజయవంతానికి, భక్తుల సౌకర్యాల ఏర్పాట్లు కృషి చేశారు. ఆయన మృతికి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క, ఎంపీ మాలోత్ కవిత, TRS జిల్లా, మండల నాయకులు, సంతాపం తెలిపారు.