AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuntala Waterfalls: డేంజర్ జోన్ లో గేమ్స్ వద్దు.. తస్మాత్ జాగ్రత్త.. పట్టు తప్పిందో ప్రాణాలు గోవిందా..!

Kuntala Waterfalls: ప్రస్తుత స్మార్ట్‌ ఫోన్ యుగంలో యువత సెల్ఫీ మోజులో మునిగి తేలుతోంది. అయితే, ఆ సెల్ఫీ మోజే వారి పాలిట యమపాశంలా..

Kuntala Waterfalls: డేంజర్ జోన్ లో గేమ్స్ వద్దు.. తస్మాత్ జాగ్రత్త.. పట్టు తప్పిందో ప్రాణాలు గోవిందా..!
Kuntala Falls
Shiva Prajapati
|

Updated on: Jul 11, 2021 | 1:29 PM

Share

Kuntala Waterfalls: ప్రస్తుత స్మార్ట్‌ ఫోన్ యుగంలో యువత సెల్ఫీ మోజులో మునిగి తేలుతోంది. అయితే, ఆ సెల్ఫీ మోజే వారి పాలిట యమపాశంలా మారుతోంది. ముందు వెనుకా ఆలోచించకుండా డేంజర్ జోన్‌లలోనూ సెల్ఫీలు దిగుతూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తెలంగాణలోని జలపాతాల వద్ద అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతానికి సందర్శకులను అనుమతించడంతో.. నాటి ప్రమాద ఘటనను అధికారులు గుర్తు చేశారు. సందర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డేంజర్ జోన్‌లో గేమ్స్ వద్దు అని హెచ్చరిస్తున్నారు. జలపాతాల వద్ద జాగ్రత్తగా ఉండాలని.. పట్టు తప్పితే ప్రాణాలు పోగొట్టుకుంటారని హితవుచెబుతున్నారు.

ఇదిలాఉంటే.. కుంటాల జలపాతం వద్ద డేంజర్ డెత్ స్పాట్‌ జోన్‌లో సెల్ఫీ మోజులో మునిగి తేలుతోంది యువత. కుంటాల జలపాతం పైకి ఎక్కి సెల్ఫీలు తీసుకుంటున్నారు పర్యాటకులు. గతంలో ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ప్రాంతంలోనే యువత కేరింతలు కొడుతోంది. ప్రమాదమని తెలిసినా కూడా.. ఎవరూ లక్ష్యపెట్టడం లేదు. డెత్ స్పాట్‌లో యువత కేరింతలకు సంబంధించి.. డేంజర్ సెల్ఫీల దృశ్యాలు టీవీ9 కెమెరాకు చిక్కాయి. వద్దని వారించినా పర్యాటకులు వినడం లేదు. గడిచిన 15 ఏళ్లలో కుంటాల సుడిగుండాలు 142 మంది ప్రాణాలను మింగేశాయి. సెల్ఫీల మోజులో కుంటాల జలపాతంలో పడి 32 మంది పర్యాటకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు సెల్ఫీలు దిగుతూ 10 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, గత రెండేళ్లుగా కరోనా ఎఫెక్ట్ ఉండటంతో కుంటాల జలపాతం వద్ద పర్యాటకుల సందడి తగ్గింది.

నిండుకుండలా కడెం ప్రాజెక్టు.. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎగువ ప్రాంతంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో ప్రాజెక్టు దాదాపుగా నిండింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 696.7 అడుగుల మేర నీరు ఉంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు ఐదు వరద గేట్లను.. ఐదు అడుగుల మేరకు ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరిలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సమీప పశువుల కాపరులు గోదావరి తీరప్రాంతంలోకి పశువులను తీసుకెళ్లవద్దని సూచించారు. కాగా, కడెం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 34,000 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 29,000 క్యూసెక్కులగా ఉంది.

Also read:

ENG vs PAK: ఈ బౌలర్లకు భయపడుతోన్న ఇంగ్లండ్ ఆల్‌ రౌండర్‌.. లిస్టులో టీమిండియా స్పిన్నర్ కూడా..!

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రాన్ని విభజిస్తున్నారా? డీఎంకే ఎంపీ కనిమొళి సంచలన కామెంట్స్..!

PAN Card: మీ వద్ద ఉన్న పాన్‌ కార్డు నిజమైనదా..? నకిలీదా..? సులభంగా తెలుసుకోండి ఇలా..?