- Telugu News Photo Gallery Cricket photos Eng vs pak ben stokes scared for bowlers hasan ali and ravichandran ashwin is also on this list
ENG vs PAK: ఈ బౌలర్లకు భయపడుతోన్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్.. లిస్టులో టీమిండియా స్పిన్నర్ కూడా..!
ఈ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ .. ప్రపంచంలోని అందరి బౌలర్లపై విరుచుకపడి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడతాడని తెలిసిందే. కానీ, కొంతమంది బౌలర్ల ముందు బలహీనుడిగా మారి వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు.
Updated on: Jul 11, 2021 | 1:17 PM

ప్రస్తుతం పాకిస్తాన్, ఇంగ్లండ్ టీంల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా జులై 10న రెండవ వన్డే లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ హసన్ అలీ అద్భుత బౌలింగ్ నమోదు చేశాడు. హసన్ అలీ తన వన్డే కెరీర్‌లో మూడవసారి ఐదు వికెట్లను పడగొట్టాడు. అలాగే మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ పై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు.

హసన్ అలీ వన్డేల్లో అత్యధికంగా 5 సార్లు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను పెవిలియన్ చేరాడు. కేవలం 13 మ్యాచుల్లో 5 వసారి స్టోక్స్ వికెట్‌ను పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీం విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్‌లో 2-0 తేడాతో ముందంజలో ఉంది. అయితే, ఈ మ్యాచ్ బెన్‌స్టోక్స్‌కు 100వ మ్యాచ్ కావడం విశేషం.

బెన్ స్టోక్స్‌ను భయపెట్టే బౌలర్లలో ఓవరాల్‌గా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలిస్థానంలో నిలిచాడు. టెస్టులు, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 15 సార్లు స్టోక్స్‌ను పెవిలియన్ చేర్చాడు. 10 వన్డేల్లో 4 సార్లు స్టోక్స్‌ను ఔట్ చేసి రెండో స్థానంలో నిలిచాడు. అలాగే 12 టెస్టుల్లో 11 సార్లు పెవిలియన్ చేర్చాడు.

ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ మూడవ స్థానంలో నిలిచాడు. లెఫ్ట్ ఆర్మ్ మిడిల్ పేసర్ అయిన ఫాల్క్‌నర్ 9 వన్డేల్లో 3 సార్లు ఇంగ్లీష్ ఆల్ రౌండర్‌ను పెవిలియన్ చేర్చాడు.

మరో ఆస్ట్రేలియా బౌలర్ కూడా స్టోక్స్‌ను భయపెట్టాడు. ఆసీస్ పేసర్ క్లింట్ మెక్కే.. 7 మ్యాచుల్లో 3 సార్లు స్టోక్స్‌ను పెవిలియన్ చేర్చాడు.



