Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Card: మీ వద్ద ఉన్న పాన్‌ కార్డు నిజమైనదా..? నకిలీదా..? సులభంగా తెలుసుకోండి ఇలా..?

PAN Card: ఆధార్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగా పాన్ కార్డ్ కూడా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. బ్యాంకు అకౌంట్‌ తీయాలన్నా, ఇతర వాటికి పాన్‌ కార్డు తప్పనిసరి అయ్యింది. అందుకే..

PAN Card: మీ వద్ద ఉన్న పాన్‌ కార్డు నిజమైనదా..? నకిలీదా..? సులభంగా తెలుసుకోండి ఇలా..?
Pan Card
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 11, 2021 | 1:12 PM

PAN Card: ఆధార్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగా పాన్ కార్డ్ కూడా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. బ్యాంకు అకౌంట్‌ తీయాలన్నా, ఇతర వాటికి పాన్‌ కార్డు తప్పనిసరి అయ్యింది. అందుకే ప్రతి ఒక్కరూ పాన్ కార్డు కలిగి ఉండటం ఎంతో మేలు. ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డులను జారీ చేస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో కూడా పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆధార్‌ కార్డు ఉంటే చాలు నిమిషాల్లోనే పాన్‌ కార్డు పొందే వెలుసుబాటు వచ్చింది. ఈ-పాన్‌కార్డును నిమిషాల్లోనే తీసుకోవచ్చు. ఎన్ఎస్‌డీఎల్, యూటీఐఐటీఎస్ఎల్ వెబ్‌సైట్ల ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పాన్ కార్డు ఇంటికి రావాలంటే కనీసం వారం రోజులు పడుతుంది. ఇకపోతే పాన్ కార్డు ఉన్నవారు ఓ విషయాన్ని గుర్తించుకోవాలి. ప్రస్తుత రోజుల్లో మోసాలు చాలా జరిగిపోతున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని కొందరు నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందువల్ల కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొందరు నకిలీ కార్డులను సృష్టిస్తున్నారు.

మీ పాన్ కార్డు నిజమైందా? కాదా? అని సులభంగానే తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు  ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ వెబ్ సైట్ ను ఓపెన్లో చేయాలి.  అక్కడ వెరిఫై పాన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి పాన్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే.. ఆ పాన్ నెంబర్ మనుగడలో ఉందో లేదో తెలిసిపోతుంది. ఈ లింక్ ద్వారా మీ పాన్ కార్డు నిజమైందో కాదో తెలుసుకోండి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో మన పేరు మీదనే నకిలీ కార్డులను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు పాన్‌ కార్డు కావాలంటే పెద్ద ప్రాసెస్‌ ఉండేది. కార్డు వచ్చేందుకు కనీసం 45 రోజుల సమయం పట్టేది. కానీ రానురాను ఆ సమయాన్ని తగ్గిపోయింది. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి పాన్‌కార్డు అవసరమైపోయింది. అందుకే ప్రతి ఒక్కరు పాన్‌ కార్డు కలిగి ఉంటున్నారు.

ఇవీ కూడా చదవండి:

Zhurong Rover: చైనాకు చెందిన జురాంగ్‌ రోవర్‌ అంగారక గ్రహంపై అన్వేషణ.. కొత్త ఫోటోలు విడుదల

Xiaomi 67w Fast Charger: షియోమి నుంచి 67w సూపర్ ఫాస్ట్ చార్జర్.. విడుదల ఎప్పుడంటే..!