Zhurong Rover: చైనాకు చెందిన జురాంగ్‌ రోవర్‌ అంగారక గ్రహంపై అన్వేషణ.. కొత్త ఫోటోలు విడుదల

Zhurong Rover: అమెరికన్‌ ఉపగ్రహం మార్స్‌ ఉపరితలంపై చైనాకు చెందిన జురాంగ్‌ రోవర్‌ చిత్రీకరించింది. మార్స్‌ రికనైసెన్స్‌ ఆర్బిటర్‌తో కొద్ది దూరం నుంచి జురాంగ్‌ రోవర్‌..

Zhurong Rover: చైనాకు చెందిన జురాంగ్‌ రోవర్‌ అంగారక గ్రహంపై అన్వేషణ.. కొత్త ఫోటోలు విడుదల
Zhurong Rover
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 10, 2021 | 1:24 PM

Zhurong Rover: అమెరికన్‌ ఉపగ్రహం మార్స్‌ ఉపరితలంపై చైనాకు చెందిన జురాంగ్‌ రోవర్‌ చిత్రీకరించింది. మార్స్‌ రికనైసెన్స్‌ ఆర్బిటర్‌తో కొద్ది దూరం నుంచి జురాంగ్‌ రోవర్‌ ల్యాండింగ్‌ చిత్రాలను బంధించింది. చైనా జురాంగ్ రోవర్ (Zhurong rover) యుటోపియా ప్లానిటియాలో దిగిన తరువాత మార్స్ ఉపరితలం నుంచి పలు చిత్రాలను పంపిన విషయం తెలిసిందే. మార్స్ నుంచి రోవర్ పంపిన కొత్త ఫొటోలను చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) విడుదల చేసింది. ఇది అంగారక గ్రహంపైకి వెళ్లినప్పటి నుంచి రోవర్‌ దక్షిణ దిశలో ప్రయాణించి డిటెక్షన్లు నిర్వహిస్తోంది. దాని నావిగేషన్‌ కెమెరా మార్గం వెంట ఉన్న ల్యాండ్‌ఫార్మ్‌ చిత్రాలను తీసింది. ఇందులో రాళ్లు, ఇసుక దిబ్బలు ఉన్నట్లు చిత్రాలలో కనిపిస్తుంది. కాగా, చైనాకు చెందిన టియాన్వెన్‌-1 మార్క్‌ ప్రొబ్‌ను జూలై 23,2020లో ప్రయోగించారు. మే 15,2021న జురాంగ్‌ రోవర్‌ను మోసుకెళ్లిన ల్యాండర్‌ అంగారక గ్రహం ఉత్తర అర్ధగోళానికి తాకింది. అయితే జురాంగ్‌ ల్యాండర్‌ నుంచి వేరుపడిన రెడ్ ప్లానెట్‌ అన్వేషించడం ప్రారంభించింది. కాగా, యునైటెడ్‌ స్టేట్స్‌ తర్వాత అంగారక గ్రహంపై రోవర్‌ ల్యాండ్‌ చేసిన రెండో దేశంగా చైనా నిలిచింది.

Zhurong Rover 1

అయితే కొన్ని రోజుల తర్వాత వాహనం ప్లాట్‌ఫాం ర్యాంప్‌లోకి వెళ్లిన చిత్రాలను విడుదల చేసిన తర్వాత చైనా అధికారులు.. ల్యాండింగ్‌ చిత్రాలను విడుదల చేసేందుకు ఆలస్యం చేసింది. రోవర్ మార్టిన్ వాతావరణంలోకి అడుగుపెట్టింది. చైనా టియాన్వెన్ -1 నుంచి విడిపోయిన తరువాత ల్యాండర్‌తో కలిసిపోయింది. జురాంగ్ ఆరు చక్రాలను మొదటిసారిగా మార్టిన్ ఉపరితలంపై నిలబడేందుకు వీలుగా లాండర్ ఒక చిన్న ర్యాంప్‌ను పంపింది. రోవర్ నావిగేషన్ కెమెరాలలో జురాంగ్ నాలుగు రెక్కలతో కూడిన సోలార్ ప్యానెల్ కమ్యూనికేషన్ యాంటెన్నా ఉంది.

ఫిబ్రవరిలో మార్టిన్ కక్ష్యకు చేరుకున్న టియాన్వెన్ -1 మిషన్ అంగారక గ్రహంపై విజయవంతంగా చైనా ల్యాండ్ చేసింది. ఇప్పటివరకూ అమెరికా మాత్రమే రెడ్ ప్లానెట్‌లో రోవర్లను విజయవంతంగా ల్యాండ్ చేసింది. అమెరికా తర్వాత అంగారకుడిపై రోవర్ ల్యాండ్ చేసిన రెండో దేశంగా చైనా అవతరించింది. ఈ రోవర్ సుమారు మూడు నెలల (90 రోజులు) పాటు అంగారకుడిపై అన్వేషణ కొనసాగించనుంది. జురాంగ్ రోవర్ ఆరు చక్రాలతో 530-పౌండ్లు. (240 కిలోగ్రాములు) బరువు ఉంది. యుటోపియా ప్లానిటియా ప్రాంతంలో భూగర్భ శాస్త్రం, వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి రోవర్ తన ఆరు పరికరాలను ఉపయోగించనుంది. ఈ రోవర్ సుమారు మూడు నెలల (90 రోజులు) పాటు అంగారకుడిపై అన్వేషణ కొనసాగించింది.

Zhurong Rover 2

ఇవీ కూడా చదవండి

Sirisha Bandla: నా కల నిజమవుతుందని తెలుసు.. అమెరికాలో వ్యోమగామి కానున్న ఆంధ్రా అమ్మాయి శిరీష బండ్ల..

Amazon Alexa: ‘అలెక్సా’ పేరు మార్చాలని డిమాండ్‌ చేస్తున్న తల్లిదండ్రులు.. ఒత్తిడికి గురై స్కూళ్లకు వెళ్లడం లేదంటూ.