Sirisha Bandla: నా కల నిజమవుతుందని తెలుసు.. అమెరికాలో వ్యోమగామి కానున్న ఆంధ్రా అమ్మాయి శిరీష బండ్ల..
ఆంధ్రా (గుంటూరు) అమ్మాయి శిరీష బండ్ల ఆదివారం అమెరికాలోని వర్జిన్ గెలాక్సిన్ స్పేస్...వీఎస్ఎస్ యూనిటీ నుంచి అంతరిక్షయానం చేయనుంది.
ఆంధ్రా (గుంటూరు) అమ్మాయి శిరీష బండ్ల ఆదివారం అమెరికాలోని వర్జిన్ గెలాక్సిన్ స్పేస్…వీఎస్ఎస్ యూనిటీ నుంచి అంతరిక్షయానం చేయనుంది. నాలుగేళ్ల ప్రాయంలోనే హూస్టన్ లో పెరిగిన ఈ 34 ఏళ్ళ యువతి.. తన కల నిజం కానుందని తాను ముందే ఊహించానని తెలిపింది.వ్యోమగామి 004 గా ఈమెను ఈ మిషన్ లో పేర్కొంటున్నారు. శబ్దానికి సుమారు మూడున్నర రెట్లు వేగంగా ప్రయాణించగల స్పేస్ క్రాఫ్ట్ లో వర్జిన్ గెలాక్టిక్ ఫౌండర్ అయిన రిచర్డ్ బ్రాన్ సన్ తోను, మరో నలుగురితోనూ కలిసి ఈ మిషన్ లో ఈమె పాల్గొంటోంది. న్యూ మెక్సికోలో వర్జిన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచే మీడియాతో ఇంటరాక్ట్ అయిన శిరీష..ఇండియా నుంచి అంతరిక్షయానం చేస్తున్న రెండో మహిళ కానుంది. నాతో బాటు ఇండియాలో ‘కొంతభాగాన్ని’ రోదసికి తీసుకువెళ్తున్నా అని శిరీష చమత్కరించింది. (2003 లో కొలంబియా స్పేస్ షటిల్ డిజాస్టర్ లో ఇండియాకే చెందిన నాసా వ్యోమగామి కల్పనా చావ్లా మరణించిన విషయం గమనార్హం).తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ వింగ్ కమాండర్ గా రిటైర్ అయ్యారు.
అమెరికాలోని బ్రిటిష్-అమెరికన్ స్పేస్ ఫ్లైట్ కంపెనీలో గవర్నమెంట్ ఎఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ గా 2015 లోనే నియమితురాలైన శిరీష..చాలా ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నట్టు తెలిపింది. ఈమె తండ్రి డా. మురళీధర్ బండ్ల యూఎస్ లో రీసెర్చర్ గా పని చేస్తున్నారు. కాగా-ఇక 70 ఏళ్ళ రిచర్డ్ బ్రాన్ సన్ కూడా ‘ఇటీజ్ టైం టు టర్న్ మై డ్రీమ్ ఇంటూ రియాలిటీ (నా కల నిజమయ్యే సమయం వచ్చింది) అని పేర్కొన్నారు. తన 71 వ జన్మ దినానికి వారం రోజులముందే ఆయన తన సొంత స్పేస్ ప్లేన్ లో రోదసియానం చేయనున్నాడు. వర్జిన్ గెలాక్సిక్ చీఫ్ బెత్ మోసెస్, లీడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ కొలిన్ బెనెట్, శిరీష బండ్ల,తో బాటు మరో ఇద్దరు పైలట్లతో బ్రాన్ సన్ వ్యోమగామి అవుతున్నాడు. ఈయన బ్రిటిష్ బిలియనీర్ కూడా.. అంతరిక్షంలో మరో అయిదుగురు ఎస్ట్రోనట్లను ఈ బృందం కలుస్తుంది. ఇలా ఉండగా ఈ నెల 20 న అమెజాన్, బ్లూఆరిజన్ ఫౌండర్..జెఫ్ బెజోస్ కూడా తన న్యూ షెఫర్డ్ రాకెట్ లో రోదసి యానం చేయనున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Realme: ‘రియల్ మీ’ సంచలనం.. రూ. 5 వేలులోపే అధునాతన ఫీచర్లతో సూపర్ ఫోన్లు..
News Watch : కొలువుల జాతర.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )