AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme: ‘రియల్ మీ’ సంచలనం.. రూ. 5 వేలులోపే అధునాతన ఫీచర్లతో సూపర్ ఫోన్లు..

మీరు కొత్తగా మొబైల్ ఫోన్ కొనాలని చూస్తున్నారా.? అయితే తక్కువలోనే స్పెషల్ ఫీచర్ల ఉన్న ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. చైనీస్ స్మార్ట్‌ఫోన్..

Realme: 'రియల్ మీ' సంచలనం.. రూ. 5 వేలులోపే అధునాతన ఫీచర్లతో సూపర్ ఫోన్లు..
Dizo Star
Ravi Kiran
|

Updated on: Jul 10, 2021 | 10:45 AM

Share

మీరు కొత్తగా మొబైల్ ఫోన్ కొనాలని చూస్తున్నారా.? అయితే తక్కువలోనే స్పెషల్ ఫీచర్ల ఉన్న ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్ మీ’ రెండు కొత్త ఫీచర్ ఫోన్లను తాజాగా విడుదల చేసింది. డిజో స్టార్ 300, డిజో స్టార్ 500 పేర్లతో రిలీజైన ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 2,299, రూ.1,799కి అందుబాటులోకి వచ్చాయి. అలాగే బ్లాక్, గ్రీన్, సిల్వర్ రంగుల్లో ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తున్నాయి. ఆకర్షణీయంగా, క్లాసికల్‌గా కనిపించే ఈ బ్రాండెడ్ ఫోన్లు చాలా సహేతుకమైన ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంటాయని సదరు సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.

డిజో స్టార్ 300 ఫీచర్లు…

  • 1.77-అంగుళాల స్క్రీన్‌
  • 2,550 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 డేస్ స్టాండ్‌బై
  • 32 ఎంబీ స్టోరేజ్, మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 64 జీబీ ఎక్స్‌టర్నల్ స్టోరేజ్
  • ఇంగ్లీష్, హిందీతో సహా తమిళం, గుజరాతీ, తెలుగు, పంజాబీ, బెంగాలీ, కన్నడ వంటి ప్రాంతీయ భాషలను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
  • ఇవే కాకుండా ఎఫ్ఎమ్ రేడియో, ఎమ్‌పీ 3 ప్లేయర్, గేమ్స్, క్యాలెండర్, అలారం, టాస్క్, కాలిక్యులేటర్ వంటి ఇతర ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

డిజో స్టార్ 500 ఫీచర్లు…

  • 2.8-అంగుళాల డిస్‌ప్లే
  • 1900 mAh బ్యాటరీ
  • ఈ ఫోన్ ఇంగ్లీష్, హిందీ, తమిళం, గుజరాతీ, తెలుగు భాషలకు సపోర్ట్ చేస్తుంది.
  • బ్లూటూత్, అలారం, సౌండ్ రికార్డర్, క్యాలెండర్, కాలిక్యులేటర్, ఎమ్‌పీ-3 ప్లేబ్యాక్, ఎఫ్ రేడియో, గేమ్స్, 0.3 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉన్నాయి.
  • కాగా, సదరు కంపెనీ ఇటీవలే తన మొట్టమొదటి వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్‌ను కూడా విడుదల చేసింది

Also Read:

లైవ్‌లో చిరుత వేటను మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ షాకింగ్ వీడియో చూడండి.!

పోస్టాఫీసు సూపర్ స్కీమ్.. ప్రతీ నెల రూ. 2 వేలు జమతో.. రూ. 1.39 లక్షలు పొందొచ్చు.!