Google Pixel 6: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ నుంచి రెండు వేరియంట్లలో స్మార్ట్‌ఫోన్లు.. అత్యాధుని ఫీచర్స్
Google Pixel 6: మార్కెట్లో కొత్త కొత్త మోడళ్లను స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు మొబైల్ దిగ్గజాలు రకరకాల మోడళ్లలో స్మార్ట్‌ఫోన్‌లను.
Google Pixel 6: మార్కెట్లో కొత్త కొత్త మోడళ్లను స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు మొబైల్ దిగ్గజాలు రకరకాల మోడళ్లలో స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. తాజాగా ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ త్వరలో తన పిక్సెల్ 6 సీరిస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. నివేదిక ప్రకారం.. పిక్సెల్6 సీరిస్ ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ గురించి అధికారికంగా ప్రకటించపోయినా ఇందుకు సంబంధించి ఫీచర్స్ లీకయ్యాయి. రెండు వేరియంట్లలో విడుదల కానున్నాయి.
ఫీచర్స్:
ఈ వేరియంట్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం. 50 ఎంపీ కెమెరా+48+12 ఎంపీ కెమెరా ఉండనుంది. అలాగే ముందు భాగంలో 12 ఎంపీ కెమెరా కలిగి ఉండే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 12 పారేటింగ్‌తో రన్ అవుతుంది. ఇందులో 8 ర్యామ్, 128 జీబీ+256+512జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.