Petrol Diesel Price Today: మండిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. లబోదిబోమంటున్న వాహనదారులు

Petrol Diesel Price Today: దేశంలో చమురు ధరలు మండిపోతున్నాయి. ఒక వైపు కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే మరో వైపు పెట్రోల్‌, డీజిల్‌..

Petrol Diesel Price Today: మండిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. లబోదిబోమంటున్న వాహనదారులు
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Jul 10, 2021 | 9:21 AM

Petrol Diesel Price Today: దేశంలో చమురు ధరలు మండిపోతున్నాయి. ఒక వైపు కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే మరో వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతి రోజు వాహనాల్లో తప్పనిసరి అయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌ ధర వంద మార్క్ దాటింది. దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాల్లో లీటర్‌ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటింది. ఈ క్రమంలో చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 26 పైసల చొప్పున పెంచాయి చమురు సంస్థలు. ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. జూలైలో ఇప్పటివరకు ఇంధన ధరలు దాదాపు ఏడుసార్లకు పైగా పెరిగాయి. తాజాగా పెరిగిన ధరలతో ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.100.91కి చేరగా, డీజిల్‌ ధర రూ.89.88కి పెరిగింది. అదేవిధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.106.93, డీజిల్‌ రూ.97.46, బెంగళూరులో పెట్రోల్‌ ధర రూ.104.29 ఉండగా, డీజిల్‌ ధర రూ.95.26కు చేరుకుంది. భోపాల్‌లో పెట్రోల్‌ ధర రూ.109.24, డీజిల్‌ ధర రూ.98.67 చేరుకుంది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.101.01, డీజిల్‌ ధరరూ.92.97 ఉంది. అలాగే చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.67 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.39కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 104.86 ఉండగా, డీజిల్‌ ధర రూ.97.96కి చేరింది. కరీంనగర్‌లో పెట్రోల్‌ ధర రూ. 105.37 ఉండగా, డీజిల్ ధర రూ.98.42 ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్‌ ధర 107.07 ఉండగా, డీజిల్‌ ధర రూ.99.60 ఉంది. విశాఖలో పెట్రోల్ ధర రూ.106.64 ఉండగా, డీజిల్‌ ధర రూ.99.15గా ఉంది.

ఇవీ కూడా చదవండి

Zomato: మీరు జోమాటో యాప్‌ వాడుతున్నారా..? మీకో బంపర్‌ ఆఫర్‌.. రూ.3 లక్షలు గెలుచుకునే అవకాశం.. ఎలాగంటే..!

Amazon Prime Day: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌ వచ్చేసింది.. ఎప్పటి నుంచి అంటే..!

Gold and Silver Price Today: దేశీయంగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు.. పలు నగరాల్లో స్వల్పంగా పెరుగుదల..!