Amazon Alexa: ‘అలెక్సా’ పేరు మార్చాలని డిమాండ్‌ చేస్తున్న తల్లిదండ్రులు.. ఒత్తిడికి గురై స్కూళ్లకు వెళ్లడం లేదంటూ.

Amazon Alexa: ఇప్పుడంతా టెక్నాలజీ రాజ్యమేలుతోంది. మనిషి చేసే ప్రతీ పనిని కంప్యూటర్‌, స్మార్ట్‌ ఫోన్‌ చేసి పెడుతోంది. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిన అద్భుత సాధనమే వర్చువల్‌ అసిస్టెంట్‌. అడిగిన వెంటనే నచ్చిన పాటను ప్లే చేయడం, తాజా వార్తలు...

Amazon Alexa: 'అలెక్సా' పేరు మార్చాలని డిమాండ్‌ చేస్తున్న తల్లిదండ్రులు.. ఒత్తిడికి గురై స్కూళ్లకు వెళ్లడం లేదంటూ.
Amazon Alexa Name
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jul 09, 2021 | 6:35 PM

Amazon Alexa: ఇప్పుడంతా టెక్నాలజీ రాజ్యమేలుతోంది. మనిషి చేసే ప్రతీ పనిని కంప్యూటర్‌, స్మార్ట్‌ ఫోన్‌ చేసి పెడుతోంది. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిన అద్భుత సాధనమే వర్చువల్‌ అసిస్టెంట్‌. అడిగిన వెంటనే నచ్చిన పాటను ప్లే చేయడం, తాజా వార్తలు తెలియజేయడం.. ఒక్కటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే వర్చువల్‌ అసిస్టెంట్‌ చేయని పనంటూ ఏది లేదు. ప్రస్తుతం యాపిల్‌ ‘సిరి’, అమేజాన్‌ ‘అలెక్సా’ పేరుతో ఈ డివైజ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ డివైజ్‌లను ఈ పేర్లతో పిలిస్తేనే స్పందిస్తాయని మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇదే పేరు అమేజాన్‌కు తలనొప్పి తీసుకొచ్చింది.

వివరాల్లోకి వెళితే.. యూకేలో ఎక్కువ మందికి అలెక్సా అనే పేరు ఉంటుంది. ఈ కారణంగా ఈ పేరు ఉన్న చిన్నారులను స్కూళ్లలో తోటి విద్యార్థులు.. ‘హే అలెక్సా’.. ‘హే అలెక్సా’ అంటూ వర్చువల్‌ అసిస్టెంట్‌కు ఆదేశాలు ఇచ్చినట్లుగా.. కామెంట్‌ చేస్తున్నారు. దీంతో చిన్నారులు తీవ్ర ఒత్తడికి గురవుతున్నారని. కొందరు చిన్నారులు పాఠశాలకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారని యూకేకు చెందిన పేరెంట్స్‌ ఆరోపిస్తున్నారు. అమేజాన్‌ వెంటనే.. ‘అలెక్సా’ పేరును మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమ చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న వర్చువల్‌ అసిస్టెంట్‌ పేరు మార్చాలని ఆందోళనలు మొదలు పెట్టారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అమేజాన్‌.. అలాంటి సంఘటనలపై విచారం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో యూజర్లకు ఓ సూచన చేసింది. వర్చువల్‌ అసిస్టెంట్‌ను అలెక్సా పేరుకు బుదులుగా.. ఎకో, కంప్యూటర్‌, అమెజాన్‌ వంటి పేర్లతోనూ వర్చువల్‌ అసిస్టెంట్‌కు కమాండ్‌ ఇవ్వొచ్చని తెలిపింది. ఇక కమాండ్స్‌ ఇవ్వడానికి మరిన్ని మార్గాలు వెతుకుతున్నామని అమేజాన్‌ తెలిపింది.

Also Read: WhatsApp: అప్పటి వరకు ఒత్తిడి.. ఆంక్షలు ఉండవు.. ప్రైవసీ పాలసీపై కోర్టుకు వివరించిన వాట్సాప్

Blaupunkt Smart TV: మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ టీవీ.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు. రూ. 14,999 నుంచే మొదలు.

Zomato: మీరు జోమాటో యాప్‌ వాడుతున్నారా..? మీకో బంపర్‌ ఆఫర్‌.. రూ.3 లక్షలు గెలుచుకునే అవకాశం.. ఎలాగంటే..!

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు