Blaupunkt Smart TV: మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ టీవీ.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు. రూ. 14,999 నుంచే మొదలు.

Blaupunkt Smart TV: కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో అందరూ ఇళ్లలోనే సినిమాలు చూడడం అలవాటు చేసుకున్నారు. ఇలాంటి వారినే టార్గెట్‌ చేసుకుంటూ ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో...

Blaupunkt Smart TV: మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ టీవీ.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు. రూ. 14,999 నుంచే మొదలు.
Blaupunkt Smart Tv
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 09, 2021 | 3:13 PM

Blaupunkt Smart TV: కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో అందరూ ఇళ్లలోనే సినిమాలు చూడడం అలవాటు చేసుకున్నారు. ఇలాంటి వారినే టార్గెట్‌ చేసుకుంటూ ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇంట్లోనే థియేటర్ సెటప్‌ చేసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగానే ఇంట్లో టీవీ సైజ్‌ పరమాణం పెరుగుతోంది. ప్రస్తుతం స్మార్ట్‌ టీవీలు చిన్న సైజ్‌ థియేటర్లను తలపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగానే టీవీ తయారీ సంస్థలకు కూడా అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ టీవీలను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం.. బ్లౌపంక్ట్‌ కొత్త టీవీని లాంచ్‌ చేసింది. మేడిన్‌ ఇండియా ఆండ్రాయిడ్ టీవీగా రూపొందించిన ఈ టీవీల్లో నాలుగు సైజులను విడుదల చేసింది. ఈ టీవీ ధరలు ఎలా ఉన్నాయి.. ఫీచర్లు ఏంటో ఓసారి చూద్దాం.

టీవీ ప్రత్యేకతలు ఇవే..

32, 42 ఇంచెస్‌ వెర్షన్ టీవీలు ఆండ్రాయిడ్‌ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ రోమ్‌ ఈ టీవీ మరో ప్రత్యేకత. ఇక వినియోగదారుడు మంచి సౌండ్ క్వాలిటీ ఎంజాయ్‌ చేయడానికి 40 వాట్స్‌ స్పీకర్లను అందించారు. ఎడ్జ్‌ ఫ్రీ సౌండ్‌ టెక్నాలజీ మరో ప్రత్యేకత. 43 ఇంచెస్‌ టీవీలో 50 వాట్సప్‌ స్పీకర్‌ను అందిస్తున్నారు. ఈ టీవీలో డాల్బీ డిజిటల్‌ ప్లస్‌ టెక్నాలజీని తీసుకొచ్చారు. 53 ఇంచెస్‌ టీవీ ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇక బ్లూటూత్‌ 5.0, 2 యూఎస్‌బీ పోర్టులు, వాయిస్‌ ఎనెబుల్‌ రిమోట్‌లతో పాటు ఏఆర్‌ఎమ్‌ కొర్టెక్స్‌ ఏ-53 ప్రాసెసర్‌ను అన్ని మోడలల్లో కామన్‌గా అందించారు.

ధరల విషయానికొస్తే..

ఈ ఆండ్రాయిడ్‌ టీవీలను రేపటి (జులై 10) నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక ధర విషయానికొస్తే 32 ఇంచుల టీవీ రూ. 14,999, 42 ఇంచుల టీవీ ధర రూ. 41,999, 43 ఇంచుల టీవీ ధర రూ. 30,999, 55 ఇంచుల టీవీ ధరను రూ. 40,999గా నిర్ణయించారు.

మూడేళ్లలో 15 శాతం మార్కెట్‌..

ఈ టీవీ లాంచింగ్‌ సందర్భంగా సూపర్ ప్లాస్ట్రోనిక్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సీఈఓ అన్వీత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని ప్రాంతాలకు న్యూ జనరేషన్‌ టీవీలను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. రానున్న మూడేళ్లలో 15 శాతం మార్కెట్‌ షేర్‌ను సొంతం చేసుకోనున్నామని అన్వీత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Vivo Y53s 4G: మీడియాటెక్ ప్రాసెసర్‌తో వివో నుంచి కొత్త ఫోన్..!

Microsoft Bonus: ఉద్యోగులకు బంపరాఫర్‌ ఇచ్చిన మైక్రోసాఫ్ట్‌.. ఎంప్లాయిస్‌ కృషికి గుర్తుగా భారీగా బోనస్‌. ఎంతో తెలిస్తే..

Zomato: మీరు జోమాటో యాప్‌ వాడుతున్నారా..? మీకో బంపర్‌ ఆఫర్‌.. రూ.3 లక్షలు గెలుచుకునే అవకాశం.. ఎలాగంటే..!