SBI: సేవింగ్స్‌ అకౌంట్‌తో ఎక్కువ వడ్డీ కోరుకుంటున్నారా.? అయితే ఎస్‌బీఐ సేవింగ్స్‌ ప్లస్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేయండి.

SBI Savings Plus Account: సాధారణంగా సేవింగ్‌ అకౌంట్స్‌తో పోలీస్తే ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ ద్వారానే ఎక్కువ వడ్డీ వస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ చేస్తే అత్యవసర సమయంలో డబ్బులను విత్‌డ్రా చేసుకోవడం...

SBI: సేవింగ్స్‌ అకౌంట్‌తో ఎక్కువ వడ్డీ కోరుకుంటున్నారా.? అయితే ఎస్‌బీఐ సేవింగ్స్‌ ప్లస్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేయండి.
Sbi
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jul 09, 2021 | 5:08 PM

SBI Savings Plus Account: సాధారణంగా సేవింగ్‌ అకౌంట్స్‌తో పోలీస్తే ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ ద్వారానే ఎక్కువ వడ్డీ వస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ చేస్తే అత్యవసర సమయంలో డబ్బులను విత్‌డ్రా చేసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అలా కాకుండా సేవింగ్స్‌ అకౌంట్‌ ద్వారా కూడా ఎక్కువ వడ్డీ రేటు పొందే అవకాశం ఉంటే బాగుంటుంది కదూ! ఇలా ఆలోచించే వారి కోసమే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అవకాశాన్ని తీసుకొచ్చింది. సాధారణంగా ఎస్‌బీఐ సేవింగ్స్‌ అకౌంట్‌ కేవలం 2.70 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే ఎక్కువ వడ్డీ కావాలనుకునే వారి కోసం సేవింగ్స్‌ ప్లస్‌ అనే అకౌంట్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ అకౌంట్‌ ఎలా ఓపెన్‌ చేయాలి? దీనివల్ల కలిగే లాభం ఏంటి అన్న అంశాలు ఓసారి తెలుసుకుందాం.

ఎస్‌బీఐ సేవింగ్స్‌ ప్లస్‌ అకౌంట్‌ కూడా సేవింగ్స్‌ అకౌంట్‌ లాంటిదే. ఇదిలా మల్టీ ఆప్షన్‌ డిపాజిట్‌ (ఎమ్‌ఓడీ) స్కీమ్‌లో అనుసంధానమై ఉంటుంది. ఈ అకౌంట్‌లో నిర్ణీత స్థాయి మించిన తర్వాత ఉన్న అదనపు డబ్బులు ఆటోమెటిగ్‌గా టర్మ్ డిపాజిట్లుగా మారిపోతాయి. ఇక మినిమం బ్యాలెన్స్‌ విషయానికొస్తే ఈ సేవింగ్స్‌ ప్లస్‌ అకౌంట్‌లో కనీసం రూ. 3000 బ్యాలెన్స్‌ ఉండాలి. ఇక అకౌంట్‌ను ఖాతాదారులు సింగిల్‌గా లేదా జాయింట్‌గా తెరిచే అవకాశాన్ని కలిపించారు. కేవైసీ డాక్యుమెంట్లు కలిగి ఉన్న వారందరూ ఈ సేవింగ్స్‌ ప్లస్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేయొచ్చు. ఈ అకౌంట్‌లో ఖాతాదారులు ఏడాది నుంచి ఐదేళ్ల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు వర్తించే వడ్డీ రేటును ఎస్‌బీఐ సేవింగ్స్‌ ప్లస్‌కు వర్తింపజేస్తారు. ప్రస్తుతం ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాదారులకు 5 నుంచి 5.30 శాతం వడ్డీని అందిస్తోంది. ఎస్‌బీఐ సేవింగ్స్ ప్లస్ అకౌంట్‌లోని డబ్బులకు ఒక లిమిట్ పెట్టుకోవచ్చు. లిమిట్ దాటిన డబ్బులు టర్మ్ డిపాజిట్‌గా మారతాయి. అకౌంట్‌‌‌కు కనీసం రూ.35,000 లిమిట్ ఉండాలి. ఇలా అయితేనే అమౌంట్‌ను మల్టీ డిపాజిట్ అకౌంట్ స్కీమ్‌కు (ఎంఓడీ) ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఒకేసారి కనీసం రూ.10,000 ఎంఓడీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. మల్టీ ఆప్షన్‌ డిపాజిట్‌తో లోన్‌ తీసుకునే అవకాశం కల్పించారు. ఈ ఖాతా తీసుకున్న వారికి 25 చెక్‌ లీవ్స్‌తో పాటు పాస్‌ బుక్‌, ఏటీఎమ్‌ కార్డు, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌ అలర్ట్‌ను వంటి ఫీచర్లను అందిస్తారు.

Also Read: Gastric Pain: గ్యాస్ట్రిక్ నొప్పి తో బాధపడుతున్నారా.. ప్రథమ చికిత్స తీసుకోండి ఇలా

Kalyan Singh: కల్యాణ్ సింగ్‌ ఆరోగ్యంపై పుకార్లు నమ్మొద్దు.. మనవడు సందీప్ సింగ్ వినతి

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీయే.. కేంద్ర, రాష్ట్రాలపై శైలజానాథ్ ఫైర్..