Kalyan Singh: కల్యాణ్ సింగ్ ఆరోగ్యంపై పుకార్లు నమ్మొద్దు.. మనవడు సందీప్ సింగ్ వినతి
యుపి మాజీ సిఎం కల్యాణ్ సింగ్‌పై వస్తున్న పుకార్లను నమ్మవద్దంటూ ఆయన మనవడు సందీప్ సింగ్ ప్రకటించారు. తాతయ్య ఆరోగ్యం గురించి వెలువడుతున్న పుకార్లను నమ్మవద్దని, కోలుకుంటున్నారని..
యుపి మాజీ సిఎం కల్యాణ్ సింగ్‌పై వస్తున్న పుకార్లను నమ్మవద్దంటూ ఆయన మనవడు సందీప్ సింగ్ ప్రకటించారు. తాతయ్య ఆరోగ్యం గురించి వెలువడుతున్న పుకార్లను నమ్మవద్దని, కోలుకుంటున్నారని సందీప్ సింగ్ వివరించారు. గత కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన్ను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ICUలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోడీ వైద్యులను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కల్యాణ్ సింగ్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు ప్రధాని మోడీ కోరారు.
మనవడు సందీప్ సింగ్ మాట్లాడుతూ… ‘‘ మా తాతయ్య కల్యాణ్ సింగ్ చికిత్సతో కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం బాగానే ఉంది, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా ఫోన్ చేసి తాతయ్య ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు’’అని మనవడు సందీప్ సింగ్ చెప్పారు. కల్యాణ్ సింగ్ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రజలు ప్రార్థనలు చేయాలని ప్రధాని మోదీ కోరారు.
Countless people across India are praying for the speedy recovery of Kalyan Singh Ji. Yesterday @JPNadda Ji, CM @myogiadityanath Ji and others went to the hospital to meet him. I just spoke to his grandson and enquired about his health.
— Narendra Modi (@narendramodi) July 9, 2021
ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సిఎం యోగి ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ స్వాత్రా దేవ్ సింగ్ ఆసుపత్రిని సందర్శించి కల్యాణ్ సింగ్‌ను పరామర్శించారు. యుపీ సీఎంగానే కాకుండా రాజస్థాన్ గవర్నర్‌గా కూడా కల్యాణ్ సింగ్ పనిచేశారు.