Fire Accident: అగ్నిప్రమాదంతో ఉలిక్కిపడ్డ ఢాకా.. 52 మంది సజీవ దహనం..కాలిబూడిదైన జ్యూస్‌ ఫ్యాక్టరీ

ఢాకా ఉలిక్కిపడింది. బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జ్యూస్‌ ఫ్యాక్టరీ కాలిబూడింది. ఈ ఘటనలో సుమారు 52 మంది అగ్నికి ఆహుతయ్యారు. 50 మందికి తీవ్రగాయాలయ్యాయి..

Fire Accident: అగ్నిప్రమాదంతో ఉలిక్కిపడ్డ ఢాకా.. 52 మంది సజీవ దహనం..కాలిబూడిదైన జ్యూస్‌ ఫ్యాక్టరీ
Bangladesh Fire Accident
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 09, 2021 | 4:53 PM

బంగ్లాదేశ్‌లోని నారాయణగంజ్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జ్యూస్ ఫ్యాక్టరీలో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 52 మంది కార్మికులు మరణించగా.. మరికొందరు ఫ్యాక్టరీలో చిక్కుపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 100 మందికిపైగా కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను తీసుకురావడానికి మొత్తం 18 ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.

ముందుగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే భవనమంతా మంటలంటుకున్నాయి. కెమికల్స్‌, ప్లాస్టిక్‌ బాటిల్స్‌ అక్కడే ఉండడంతో మంటల తీవ్రత పెరిగింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన ఫ్యాక్టరీలోని సిబ్బంది కొంతమంది భవనం పై నుంచి కిందకు దూకేశారు. కిందపడడంతో తీవ్రగాయాలపాలై చనిపోయారు. 18 అగ్నిమాపక వాహనాలతో మంటలార్పారు సిబ్బంది. అగ్నిప్రమాదంలో పదుల సంఖ్యలో చనిపోవడంతో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో 44 మంది అదృశ్యమయ్యారు. కాలిన శవాలతో ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం అలుముకుంది. మృతుల కుటుంబసభ్యుల రోదనలతో ఫ్యాక్టరీ ప్రాంతం దద్దరిల్లుతోంది.

అయితే, ఈ ప్రమాదానికి ఫ్యాక్టరీలో జరుగుతున్న వెల్డింగ్ వర్క్‌ నుంచి ఎగిసిన చిన్న నిప్పు రవ్వ ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ఫ్యాక్టరీలో100 మందికిపైగా ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎంత నష్టం వాటిల్లిందనే అంశాలపై అక్కడి అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో అంతా మహిళ కార్మికులని సమాచారం.

ఇది కూడా చదవండి : L Ramana Resign: తెలంగాణలో తెలుగుదేశంపార్టీకి మరో షాక్.. అధ్యక్ష ప‌ద‌వికి ఎల్ ర‌మ‌ణ రాజీనామా..!

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..