Ramky Group: రాంకీ గ్రూపులో రూ. 1200 కోట్ల కృత్రిమ నష్టం.. రూ. 300 కోట్ల బ్లాక్ మనీ గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ
రాంకీ సంస్థపై ఐటీ శాఖ తాజాగా జరిపిన దాడుల్లో భారీ ఎత్తున బ్లాక్ మనీ బయటపడింది. రాంకీ గ్రూపుకు సంబంధించిన సంస్థల్లో రూ. 300 కోట్ల బ్లాక్ మనీని గుర్తించామని..
Ayodhya Rami Reddy: రాంకీ సంస్థపై ఐటీ శాఖ తాజాగా జరిపిన దాడుల్లో భారీ ఎత్తున బ్లాక్ మనీ బయటపడింది. రాంకీ గ్రూపుకు సంబంధించిన సంస్థల్లో రూ. 300 కోట్ల బ్లాక్ మనీని గుర్తించామని ఐటీ అధికారులు వెల్లడించారు. రూ. 1,200 కోట్ల కృత్రిమ నష్టాన్ని చూపి పన్నులు ఎగ్గొట్టారని వెల్లడించారు. రూ. 300 కోట్ల బ్లాక్ మనీకి ట్యాక్స్ చెల్లించేందుకు రాంకీ సంస్థ యాజమాన్యం అంగీకరించిందని చెప్పారు. రాంకీలోని మేజర్ వాటాని సింగపూర్ వ్యక్తులకు అమ్మేశారని… రూ. 288 కోట్లకు సంబంధించిన పత్రాలను నాశనం చేశారని ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇలా ఉండగా, ఈ నెల 6న రాంకీ సంస్థలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ ప్రధాన కార్యాలయంలో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. దీంతోపాటు రాంకీ సంస్థ అనుబంధ కార్యాలయాల్లోనూ సోదాలు జరిపారు. ఐటీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు నిర్వహించారు.
వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డికి చెందిన రాంకీ సంస్థ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. సంస్థలతోపాటు ఎంపీ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. పలు లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను ఈ సందర్భంగా ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది.
Read also: YS Jagan: బద్వేల్ నియోజయకవర్గానికి ఎప్పుడూ మంచి జరగలేదు : సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి