AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pension Scheme: 60 ఏళ్ల తర్వాత ఆర్ధిక భద్రత కోసం ఈ స్కీమ్..రోజుకు రూ.7 పొదుపుతో ఏడాదికి 60 వేలు పెన్షన్

Pension Scheme: ప్రతి వ్యక్తి కొంత వయసు వచ్చిన తర్వాత కష్టపడలేడు.. అప్పడు ఆర్ధిక భద్రత కోరుకుంటాడు.. అటువంటి ఆర్ధిక భద్రతను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం..

Pension Scheme: 60 ఏళ్ల తర్వాత ఆర్ధిక భద్రత కోసం ఈ స్కీమ్..రోజుకు రూ.7 పొదుపుతో ఏడాదికి 60 వేలు పెన్షన్
Pension Scheme
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 10, 2021 | 1:23 PM

Share

Pension Scheme: ప్రతి వ్యక్తి కొంత వయసు వచ్చిన తర్వాత కష్టపడలేడు.. అప్పడు ఆర్ధిక భద్రత కోరుకుంటాడు.. అటువంటి ఆర్ధిక భద్రతను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఓ మంచి పథకాన్ని తీసుకుని వచ్చింది. అదే అటల్ పెన్షన్ యోజన పథకం. ఈ స్కీమ్ లో చేరినవారు మంచి బెనిఫిట్స్ ని పొందొచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఏ సమస్య లేకుండా ఉండాలని అనుకునేవారు ఈ పథకంలో చేరవచ్చు. ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసి.. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.5 వేల వరకు పొందొచ్చు.

మీరు అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరితే నెలకు కనీసం రూ.1000 పెన్షన్ పొందొచ్చు. రూ.2,000, రూ.3 వేలు, రూ.4,000, రూ.5 వేలు పెన్షన్ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ పథకంలో చేరి 60 ఏళ్లు వచ్చే వరకు మీరు డబ్బులు తప్పక కడుతూ వెళ్లాలి. 60 ఏళ్ల తర్వాతి నుంచి మీకు ప్రతి నెలా ఈ డబ్బులు వస్తాయి.

ఈ పధకంలో ఎవరు చేరచ్చు అనేది చూస్తే.. 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరచ్చు. 18 ఏళ్ల వయసులో ఉన్న వారు నెలకు రూ.42 చెల్లిస్తే నెలవారీ పెన్షన్ కింద రూ.1000 పొందొచ్చు.

అదే ఒకవేళ రూ.2 వేలు పొందాలని అనుకుంటే అప్పుడు నెలకు రూ.84 కట్టాలి. రూ.5 వేలు పొందాలని చూస్తే.. నెలకు రూ.210 చెల్లించాలి. అంటే రోజుకు రూ.7 ఆదా చేస్తే చాలు. ఈ పథకం ద్వారా లబ్ది పొందాలనుకునే వారు బ్యాంకులకు వెళ్లి కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సహా ఇతర బ్యాంకులు కూడా అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ను అందిస్తున్నాయి. ఒకవేళ అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన వారు మరణిస్తే భాగస్వామికి పెన్షన్ డబ్బులు అందిస్తారు.

Also Read: Pew Survey: అత్యధిక హిందువులు పూజించే దేవుడు ఎవరు ? .. అమెరికాకు చెందిన సంస్థ సర్వేలో ఆసక్తికర విషయాలు (photo gallery)