JIO : ఇంటర్ నెట్ స్పీడ్‌లో జియోనే టాప్.. 4జీ సెగ్మెంట్‌లో 21.9 మెగాబిట్ పర్ సెకండ్
JIO : జియో రాకతో ఇంటర్‌నెట్ వినియోగం బాగా పెరిగింది. వేగమైన ఇంటర్‌నెట్‌ను అందించే 4జీ సేవలను అత్యంత తక్కువ ధరకు
JIO : జియో రాకతో ఇంటర్‌నెట్ వినియోగం బాగా పెరిగింది. వేగమైన ఇంటర్‌నెట్‌ను అందించే 4జీ సేవలను అత్యంత తక్కువ ధరకు అందిచండంతో వినియోగదారులు జియోకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకర్షించిన సంస్థగా జియో రికార్డు సృష్టించింది. ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ ప్లాన్‌లను సవరిస్తుంది కాబట్టే జియోకు ఇంత ఆదరణ పెరిగింది. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత డేటా వాడకం ఎక్కువ అయ్యింది. ఇక ముఖ్యంగా జియో అడుగు పెట్టిన తర్వాత డేటా వాడకం మరింత అధికమయ్యింది.
తాజాగా ఇంటర్నెట్ వేగం విషయంలో రిలయన్స్ జియో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 4జీ సెగ్మెంట్‌లో 21.9 మెగాబిట్ పర్ సెకండ్ సగటు వేగంతో టాప్‌లో నిలిచింది. అప్‌లోడ్ విషయంలో 6.2 ఎంబీబీపీఎస్ స్పీడ్‌తో వొడాఫోన్ ఐడియా మొదటి స్థానం సొంతం చేసుకుంది. డౌన్‌లోడ్ స్పీడ్‌విషయంలో వొడాఫోన్ ఐడియా 6.5 ఎంబీపీఎస్ సగటు వేగం అందిస్తుండగా.. జియో అంతకు మూడు రెట్ల వేగంతో డేటాను అందిస్తోంది. ఈ విషయంలో ఎయిర్‌టెల్ మూడోస్థానంలో నిలిచింది. 5ఎంపీబీఎస్ సగటు వేగాన్ని ఆ కంపెనీ నమోదు చేసినట్లు ట్రాయ్ పేర్కొంది. మైస్పీడ్ అప్లికేషన్ సాయంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన డేటా ఆధారంగా ఈ వివరాలను ట్రాయ్ ప్రతి నెలా వెల్లడిస్తుంది.
ఇదిలా ఉంటే.. జియో మరో సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడాది పాటు కాలపరిమితి ఉండే ఈ ప్లాన్ రూ.3,499కి లభించనుంది. ఈ ప్లాన్ తీసుకుంటే రోజుకు 3జీబీ డేటా చొప్పున మొత్తం 1095జీబీ 4జీ డేటాను పొందవచ్చు. రోజులో 3జీబీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత నెట్ వేగం 64కేబీపీఎస్‌కు పడిపోతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి.