YS Jagan: బద్వేల్ నియోజయకవర్గానికి ఎప్పుడూ మంచి జరగలేదు : సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి

ఇంతకాలం పాలించిన పాలకుల్లో చిత్తశుద్ధి లేక బద్వేల్‌ నియోజకవర్గం రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన నియోజయవర్గాల్లో ఒకటిగా ఉందని..

YS Jagan: బద్వేల్ నియోజయకవర్గానికి ఎప్పుడూ మంచి జరగలేదు : సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి
Ys Jagan
Follow us

|

Updated on: Jul 09, 2021 | 3:04 PM

CM Jagan Badvel meeting: ఇంతకాలం పాలించిన పాలకుల్లో చిత్తశుద్ధి లేక బద్వేల్‌ నియోజకవర్గం రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన నియోజకవర్గాల్లో ఒకటిగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బద్వేల్‌కి ఎంత చేసినా తక్కువేనని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు సహా బద్వేల్ నియెజకవర్గం కోసం అడిగిన డిమాండ్లన్నింటినీ శాంక్షన్ చేస్తున్నట్టు సీఎం చెప్పారు. రూ.500 కోట్లతో బద్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపన చేశామని సీఎం అన్నారు.

ప్రజల కోరిక మేరకు బద్వేల్‌లో ఆర్టీఓ కార్యాలయం మంజూరు చేస్తున్నానని చెప్పారు. బ్రహ్మంసాగర్‌ ఇకపై నిండుకుండలా కనిపిస్తోందని, ప్రాజెక్టులో ఎల్లప్పుడూ జలకళ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బద్వేల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బద్వేల్ అభివృద్ధికి రూ.300 కోట్లు కేటాయించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బ్రహ్మంసాగర్‌ నిండుకుండలా ఉండాలంటే.. కుంధూ నది మీద లిఫ్ట్‌ పెట్టి నీరు తీసుకొని రాగలిగితే బ్రహ్మంసాగర్‌ నిండుకుండలా ఉంటుందని అధికారంలోకి వచ్చిన వెంటనే కుంధూనదిపై లిఫ్ట్‌కు రూ.600 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేశామని సీఎం చెప్పారు. ఆ ప్రాజెక్టు కూడా మరో రెండు సంవత్సరాల్లో పూర్తయిన తరువాత.. బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా ఎల్లప్పుడూ ఉంటుందని మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నానని సీఎం చెప్పుకొచ్చారు.