AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore: నెల్లూరులో దారుణం.. 17 రోజుల పసికందును నీటి ట్యాంక్‌లో పడేసి చంపేశారు…

కొన్ని సంఘటనలు చూస్తుంటే... ఇలాంటి పనులు చేసేది మనుషులా.. క్రూర మృగాలా.. అనిపిస్తుంటుంది. నెల్లూరులో జరిగిన ఓ హృదయవిదారక ఘటన కూడా అలాంటిదే....

Nellore: నెల్లూరులో దారుణం.. 17 రోజుల పసికందును నీటి ట్యాంక్‌లో పడేసి చంపేశారు...
17 Days Baby Killed
Ram Naramaneni
|

Updated on: Jul 09, 2021 | 3:47 PM

Share

కొన్ని సంఘటనలు చూస్తుంటే… ఇలాంటి పనులు చేసేది మనుషులా.. క్రూర మృగాలా.. అనిపిస్తుంటుంది. నెల్లూరులో జరిగిన ఓ హృదయవిదారక ఘటన కూడా అలాంటిదే. నెల్లూరులోని రంగనాయకులపేటలో 17 రోజుల పసికందుకు గుర్తుతెలియని వ్యక్తులు నీటి ట్యాంక్‌లో పడేసి కిరాతకంగా చంపారు. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి.. ఇంకా కళ్లు కూడా సరిగా తెరవని ఆ పసికందు జీవితాన్ని 17 రోజులకే అంతం చేశారు. చూడగానే ముద్దులొలికే పాపను చంపిందెవరు? ఇంత కర్కషంగా ప్రాణాలు తీసిందెవరు? ఇలాంటి రాక్షస మనసున్నదెవరికి? కచ్చితంగా తెలిసిన వారి పనే అయ్యుంటుందని అంతా అనుమానిస్తున్నారు. పకింట్లో ఉంటున్న మహిళే ఈ ఘాతుకానికి పాల్పడిందా..? పాపకు అమ్మమ్మ వరసయ్యే జ్యోతి చంపి ఉంటుందని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పక్షం రోజులకే చిన్నారికి నూరేళ్లు నిండటాన్ని జీర్ణించుకోలేక రోదిస్తున్నారు.

వైద్యుల నిర్లక్ష్యం.. చిన్నారి మృతి

హైదరాబాద్​ వనస్థలిపురం ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన బాబు మృత్యువాతపడ్డాడు. ఈ నెల 5న ప్రసవం కోసం ఏరియా ఆస్పత్రికి నిండు గర్భిణీ వెళ్లింది. ఆస్పత్రిలో చేర్చుకున్న డాక్టర్లు.. ఆమెకు పురిటి నొప్పులు వచ్చినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. 3 రోజుల తర్వాత ఆపరేషన్ చేసి శిశువును బంధువులకు అప్పగించారు. కాగా బాబు అప్పటికే ఉమ్మనీరు తాగి మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. వైద్యులు సరైన సమయంలో ప్రసవం చేయకుండా నిర్లక్ష్యంగా ఉండటంతోనే తమ బాబు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: బావతో మరదలి సరదా.. బాలీవుడ్ పాటకు ఓ రేంజ్‌లో స్టెప్పులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

రోడ్డంతా నాదే.. మందుబాబు డేంజర్ డ్రైవింగ్ విన్యాసాలు చూస్తే షాకే..