AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: రోడ్డంతా నాదే.. మందుబాబు డేంజర్ డ్రైవింగ్ విన్యాసాలు చూస్తే షాకే..

Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దంటూ పోలీసులు ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా కొందరు బేవర్స్ గాళ్లు తమ తీరు మార్చుకోవడం లేదు. తాగి బండి నడిపితే ఎదురయ్యే అనర్థాలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Shocking Video: రోడ్డంతా నాదే.. మందుబాబు డేంజర్ డ్రైవింగ్ విన్యాసాలు చూస్తే షాకే..
Drunk Drive
Janardhan Veluru
|

Updated on: Jul 09, 2021 | 3:30 PM

Share

Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దంటూ పోలీసులు ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా కొందరు బేవర్స్ గాళ్లు తమ తీరు మార్చుకోవడం లేదు. తాగి బండి నడిపితే ఎదురయ్యే అనర్థాలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనాలను సీజ్ చేసి మందుబాబుల నుంచి భారీగా జరిమానాలు విధిస్తున్నారు.  అయినా కొందరు వాహనదారులు మాత్రం.. అయితే నాకేంటి అన్నట్లు… నిత్యం ఫూటుగా తాగి రోడ్లపైకి వస్తున్నారు. నడి రోడ్లపై వింత విన్యాసాలతో ఇతర వాహనాలదారులకు అగ్ని పరీక్షలు పెడుతున్నారు. తద్వారా సొంత ప్రాణాలతో పాటు రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారుల ప్రాణాలతోనూ మందుబాబులు చెలగాటమాడుతున్నారు. ఇలా తాగిన మత్తులో ఓ బైకర్ చేసిన విన్యాసాలు పూర్తిగా సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ సీసీటీవీ ఫూటేజీని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైకర్ కిందపడి లేచి…ఎదురుగా, వెనుక వెపు నుంచి వచ్చే ఇతర వాహనాలకు అడ్డంగా బైక్‌ను నడపడం, రోడ్డుపై వెళ్తున్న మరో కారును గుద్దడం ఇందులో రికార్డు అయ్యింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని కోరుతూ సైబరాబాద్ పోలీసులు ఈ వీడియోను షేర్ చేయగా..సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. రోడ్డంతా నాదే అన్నట్లు సాగే ఆ మందుబాబు డ్రైవింగ్ విన్యాసాలు నవ్వులు పూయించడమే కాదు..  డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనతో పాటు రోడ్డుపై వెళ్లే ఇతరులకు ఎంత ప్రమాదకరమో ఈ వీడియో అద్దంపడుతోంది.

ఇంతకీ ఆ వ్యక్తి క్షేమంగా తన ఇళ్లు వెళ్లి చేరాడా లేదా? అని ఓ నెటిజన్ ఆరా తీయగా..స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మన పొరబాటు లేకుండానే ఇతరుల రాష్ డ్రైవింగ్‌తో ప్రాణాలు పోయే రోజులివి… స్వల్ప గాయాలతో ఇళ్లు చేరిన అతను లక్కీ ఫెలో అంటూ ఆ నెటిజన్ కామెంట్ చేశాడు.

Also Read..

Valvo Car Sales: తగ్గేదే లే.. వాల్వో లగ్జరీ కార్లనూ హాట్ కేకుల్లా కొనేస్తున్న జనం..

Viral Video: ‘మ్యావ్.. మ్యావ్’ అంటోన్న పెద్ద పిల్లి గోడ ఎక్కింది.. నెటిజన్లను ఆకట్టుకుంది.. వైరల్ వీడియో!