Valvo Car Sales: తగ్గేదే లే.. వాల్వో లగ్జరీ కార్లనూ హాట్ కేకుల్లా కొనేస్తున్న జనం..

Volvo Cars: కొందరు తమ విలాసాలు, వినోదాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కరోనా పాండమిక్‌ను వెక్కిరిస్తూ తమ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ విషయమేంటంటే..అత్యంత ఖరీదైన వాల్వో కార్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

Valvo Car Sales: తగ్గేదే లే.. వాల్వో లగ్జరీ కార్లనూ హాట్ కేకుల్లా కొనేస్తున్న జనం..
Volvo Car
Follow us

|

Updated on: Jul 09, 2021 | 1:51 PM

Valvo Car Sales: కరోనా పాండమిక్ చాలా మంది జీవితాల్లో అంధకారం నింపింది. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులను అభద్రతా భావానికి గురిచేస్తోంది. భవిష్యత్తుపై బెంగతో చాలా మంది ఖర్చులను బాగా తగ్గించేసుకున్నారు. కొత్త ఇళ్లు, కార్లు కొనుగోలు వంటి ప్లాన్స్‌ను వాయిదావేసుకున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. కొందరు తమ విలాసాలు, వినోదాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కరోనా పాండమిక్‌ను వెక్కిరిస్తూ తమ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ విషయమేంటంటే..అత్యంత ఖరీదైన వాల్వో కార్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మాసం వరకు ఏకంగా 713 వాల్వో కార్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. గత ఏడాది తొలి ఆరుమాసాల్లో కరోనా ఫస్ట్ వేవ్ ప్రభావంతో కేవలం 469 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. సెకండ్ వేవ్ ప్రభావమున్నా స్వీడన్‌కు చెందిన వాల్వో కార్ల విక్రయాలపై పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. హై ఎండ్ లగ్జరీ కార్ల సెగ్మెంట్‌లో 52శాతం వృద్ధిని నమోదుచేసుకోవడం పట్ల వాల్వో కార్ ఇండియా హర్షం వ్యక్తంచేసింది. ఆర్థికంగా ఆనిశ్చికరమైన పరిస్థితుల్లోనూ కార్ల విక్రయాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసుకోవడం సంతృప్తిని కలిగిస్తున్నట్లు తెలిపింది. అయితే సెకండ్ వేవ్ కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేయడంతో ఏప్రిల్-జూన్ మాసాల్లో కార్ల విక్రయాలు తగ్గాయని ఆ కంపెనీ వెల్లడించింది.

2021 సంవత్సరపు తొలి ఆరు మాసాల్లో వాల్వో మిడ్ సైజ్ లగ్జరీ కారు SUV XC60 మోడల్ కార్లు అత్యధికంగా అమ్ముడుపోయాయి. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో ఈ సంవత్సరపు తదుపరి ఆరు మాసాల్లో విక్రయాల జోరు మరింత పుంజుకునే అవకాశముందని ఆ కంపెనీ ఆశాభావం వ్యక్తంచేస్తోంది. ఈ ఏడాది చివరినాటికి పూర్తిస్థాయి SUV ఎలక్ట్రిక్ కారు(XC40 Recharge)ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు వాల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా తెలిపారు.

Volvo India

Volvo India

ఇదిలా ఉండగా ఈ ఏడాది తొలి ఆరు మాసాల్లో దేశంలో 4,857 లగ్జరీ కార్లను విక్రయించినట్లు జర్మనీకి చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. 2019లో 13,786 కార్లు అమ్ముడవ్వగా…2020లో 7,893 కార్లు విక్రయించినట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

Latest Articles
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్