SBI KYC: కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని లింక్‌ వచ్చిందా.? క్లిక్‌ చేస్తే అంతే సంగతులు. ఎస్‌బీఐ ఖాతదారులే లక్ష్యంగా.

SBI KYC: రోజురోజుకీ సైబర్‌ దాడులు పెరుగుతూనే ఉన్నాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాల ట్రెండ్‌ కూడా మారుతోంది. తాజాగా కేవైసీ అప్‌డేట్‌ పేరుతో ఖాతాదారులను బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి మోసమే ఒకటి బయటకు వచ్చింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా...

SBI KYC: కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని లింక్‌ వచ్చిందా.? క్లిక్‌ చేస్తే అంతే సంగతులు. ఎస్‌బీఐ ఖాతదారులే లక్ష్యంగా.
Fraud Kyc Sbi
Follow us

|

Updated on: Jul 09, 2021 | 8:40 PM

SBI KYC: రోజురోజుకీ సైబర్‌ దాడులు పెరుగుతూనే ఉన్నాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాల ట్రెండ్‌ కూడా మారుతోంది. తాజాగా కేవైసీ అప్‌డేట్‌ పేరుతో ఖాతాదారులను బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి మోసమే ఒకటి బయటకు వచ్చింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులనే లక్ష్యంగా చేసుకొని చైనాకు చెందిన హ్యాకర్లు సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయమై ఢిల్లీకి చెందిన సైబర్‌పీస్‌ ఫౌండేషన్‌, ఆటోబాట్‌ ఇన్ఫోసెక్‌ అనే సంస్థలు ఇటీవల జరుగుతున్న ఈ సైబర్‌ నేరాలను బయటపెట్టి ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌కు కేవైసీ వెరిఫికేషన్‌ పేరుతో ఓ మెసెజ్‌ను పంపిస్తున్నారు. మెసేజ్‌లోని లింక్‌ను క్లిక్‌ చేయగానే అచ్చంగా ఎస్‌బీఐ పేజీని పోలిన కొత్త పేజ్‌ ఓపెన్‌ అవుతుంది. అనంతరం ఫోన్‌కు ఓ ఓటీపీ వస్తుందని అది ఎంటర్‌ చేయాలని అలర్ట్‌ వస్తుంది. ఆ తర్వాత మరో పేజీ ఓపెన్‌ కావడంతో పేరు, మొబైల్‌ నంబరు, పుట్టినతేదీ వంటి వివరాలు ఇవ్వమని అడుగుతుంది. ఇవన్నీ అచ్చంగా ఎస్‌బీఐ పేజీనే పోలి ఉండడంతో మీరు మోసపోతున్నారన్న విషయాన్ని కూడా గుర్తించరు. ఇలా అన్ని వివరాలు సేకరించిన తర్వాత మీ ఖాతాల్లోని డబ్బును ఎంచక్కా కొట్టేస్తారు. ఇక సైబర్‌ నేరగాళ్లు అంతోనే ఆగకుండా.. సర్వేలో పాల్గొనమని ఓ లింక్‌ను పంపిస్తున్నారు. ఇందులో పాల్గొంటే రూ. 50 లక్షలు గెలుచుకోవచ్చని ఆశ చూపుతున్నారు. ఒకవేళ ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తే మన వ్యక్తిగత వివరాలు అడుగుతుంది. ఇలా సేకరించిన వివరాలతో ఖాతాలోని డబ్బులను కొట్టేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఇదంతా చైనాకు చెందిన హ్యాకర్ల పనని నిపుణులు చెబుతున్నారు. అనుమానాస్పదంగా కనిపించే లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Padayatra: రాజకీయ పాదయాత్రలకు చిరునామా తెలుగు నేల.. ఎందరో విన్ అయ్యారు.. మరికొందరు రెడీ అయ్యారు

Pension Scheme: 60 ఏళ్ల తర్వాత ఆర్ధిక భద్రత కోసం ఈ స్కీమ్..రోజుకు రూ.7 పొదుపుతో ఏడాదికి 60 వేలు పెన్షన్

CM KCR review: కరోనా విస్తరణపై క్రిటికల్ అనాలిసిస్ చేయండి.. అధికారులను ఆదేశించిన CM KCR