AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padayatra: రాజకీయ పాదయాత్రలకు చిరునామా తెలుగు నేల.. ఎందరో విన్ అయ్యారు.. మరికొందరు రెడీ అయ్యారు

చరిత్రలో పాదయాత్రలు చేసిన గొప్ప నాయకులున్నారు.. కానీ రాజకీయ యాత్రలకు మాత్రం ఫేమస్‌ తెలుగు రాష్ట్రాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Padayatra: రాజకీయ పాదయాత్రలకు చిరునామా తెలుగు నేల.. ఎందరో విన్ అయ్యారు.. మరికొందరు రెడీ అయ్యారు
Padayatra In Telangana
TV9 Telugu Digital Desk
| Edited By: Ram Naramaneni|

Updated on: Jul 09, 2021 | 8:24 PM

Share

చరిత్రలో పాదయాత్రలు చేసిన గొప్ప నాయకులున్నారు.. కానీ రాజకీయ యాత్రలకు మాత్రం ఫేమస్‌ తెలుగు రాష్ట్రాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1980ల్లో అన్న ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర ద్వారా జనాల వద్దకు వెళ్లి.. అదే జనామోదంతో సీఎం కూడా అయ్యారు. ఆ తర్వాత చాలామందే బస్సు యాత్రలు చేశారు కానీ.. వైఎస్‌ చేసిన ప్రజాప్రస్థాన యాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయిపోయిందనుకున్న హస్తం పార్టీకి జవసత్వాలు నింపి 2004లో అధికారపీఠం అందించడంలో ఆ యాత్ర కీలక పాత్ర పోషించింది. జగన్‌ కూడా ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. మళ్లీ తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్‌ యాత్రా సీజన్‌ మొదలైంది. కేవలం పాదయాత్రలతోనే అధికారాన్ని అందుకోవడం సాధ్యం కాదు.. కానీ ఆయా పార్టీలు, వ్యక్తుల విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. వైఎస్‌ఆర్‌, చంద్రబాబు, జగన్మోహన్‌ రెడ్డి సహా అంతా పాదయాత్రలను నమ్ముకున్నవారే. అందరికీ స్ఫూర్తి మాత్రం వైఎస్‌ఆర్‌ చేసిన ప్రజాప్రస్థానం. అందుకే పాదయాత్ర చేస్తే ఫలితం ఉంటుందని బలంగా నాటుకుపోయింది నాయకుల్లో. తెలుగురాష్ట్రాల్లో ఎన్నికలంటే పాదయాత్ర చర్చ కామన్.

తెలంగాణలో మళ్లీ యాత్రల సీజన్‌ మొదలైంది. 2023లో జరిగే ఎన్నికలే లక్ష్యంగా ఆయా పార్టీల అగ్రనేతలు యాత్రలకు రెడీ అయిపోతున్నారు. అందరికంటే ముందే ఫస్ట్‌ ఫేజ్‌ యాత్ర రూట్‌ మ్యాప్ ప్రకటించారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. భాగ్యలక్ష్మి టెంపుల్‌ నుంచి హుజూరాబాద్‌ వరకూ యాత్ర షెడ్యూల్‌ ఫిక్స్‌ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి కూడా యాత్రపై క్లారిటీ ఇవ్వకపోయినా.. చేయడం పక్కా అంటున్నారు ఆ పార్టీ నాయకులు. లేటెస్టుగా వచ్చి పార్టీ పెట్టిన షర్మిల కూడా టైమ్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. పాదయాత్రకు పేటెంట్‌ హక్కులు మావే అంటున్నారు వెఎస్సార్ అభిమానులు. నాడు వైఎస్, తర్వాత జగన్‌.. మధ్యలో షర్మిల ఈ కుటుంబంలో ఇప్పటికే ముగ్గురు యాత్రలు చేసిన చరిత్ర ఉంది. తెలంగాణ రాజకీయాల్లో బలపరీక్షకు దిగిన వైఎస్‌ కుటుంబానికి మరోసారి యాత్రే కీలకం కానుంది. తండ్రి చేసిన యాత్రనే నమ్ముకున్నారు వైఎస్‌ షర్మిల.

ఇక తెలంగాణ పాదయాత్రల సీజన్‌ రాబోతోంది అంటూ తనదైన శైలిలో పంచ్‌లు పేల్చారు మినిస్టర్‌ కేటీఆర్‌. పాదయాత్రలు చేయండి… మంచిదే కరోనా తర్వాత ఆరోగ్యం కూడా మంచిగా అవుతుందంటూ సెటైర్లు వేశారు. యాత్రలతో వెళితే తెలంగాణ అభివృద్ధి అయినా మీకు కనిపిస్తుందన్నారు. మొత్తానికి తెలంగాణలో టీఆర్‌ఎస్‌పై సమర శంఖం పూరించడానికి, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని వారి ఓట్లను తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ రంగంలోకి దిగుతున్నాయి. పాదయాత్రల సీజన్ ఎవరికి కలిసొస్తుందో చూడాలి.

Also Read: జోతిష్యాలయం పెట్టి మోసాలు షురూ చేశాడు.. లేడీ డాక్టర్‌ను నిండా ముంచేశాడు

బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన సీఎం జగన్.. సొగసరి షాట్లతో ఫిదా చేశారు