AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR review: కరోనా విస్తరణపై క్రిటికల్ అనాలిసిస్ చేయండి.. అధికారులను ఆదేశించిన CM KCR

ప్రజల్లో తప్పనిసరిగా మాస్కులను ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కట్టడికోసం ప్రభుత్వంతో కలిసిరావాలని, స్వీయ నియంత్రణను పాటిస్తూ.. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని ప్రజలకు CM KCR పిలుపునిచ్చారు.

CM KCR review: కరోనా విస్తరణపై క్రిటికల్ అనాలిసిస్ చేయండి.. అధికారులను ఆదేశించిన CM KCR
Cm Kcr
Sanjay Kasula
|

Updated on: Jul 09, 2021 | 8:08 PM

Share

కరోనాను గుర్తించి ముందస్తు కట్టడి చేసి, ఇప్పటికే విజయవంతంగా నిర్వహించిన జ్వర సర్వేను మరోసారి రాష్ట్రంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాలేదనీ, ఈ నేపథ్యంలో, రాష్ట్రానికి చెందిన సరిహద్దు జిల్లాల్లో కరోనా ప్రభావం పూర్తిగా సమసి పోలేదన్నారు. అటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ శాస్త్రీయ అధ్యయనం చేసి, కరోనా విస్తరణకు గల కారణాలను క్రిటికల్ అనాలిసిస్’ చేయాలన్నారు. అందుకు సంబంధించి శాస్త్రీయ పద్దతుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి S.A.M రిజ్వీ ఆధ్వర్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారుల వైద్య బృందం ఈ నెల 11, 12, 13 తేదీల్లో కరోనా ప్రభావిత సరిహద్దు జిల్లాల్లో పర్యటించి రావాలన్నారు. ప్రజల్లో తప్పనిసరిగా మాస్కులను ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కట్టడికోసం ప్రభుత్వంతో కలిసిరావాలని, స్వీయ నియంత్రణను పాటిస్తూ.. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని ప్రజలకు సిఎం పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పారిశుధ్యపరిస్థితుల్లో గుణాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని తద్వారా కూడా కరోనా కట్టడి చేయగలిగామని సిఎం అన్నారు.

నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట ,ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరి ఖని, సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు, హెలికాప్టర్ ద్వారా వరుస పర్యటనలను చేపట్టాలని CM KCR ఆదేశించారు. పర్యటన అనంతరం నివేదికను సిద్దం చేసి కేబినెట్ కు సమర్పించాలన్నారు. జిల్లాల్లో కరోనా విస్తరించడానికి గల ప్రధాన కారణాలను క్రేత్రస్థాయిలో అధ్యయనం చేసి పర్యటన సందర్భంగా విశ్లేషించాలన్నారు. కరోనా నియంత్రణకోసం చేపట్టాల్సిన చర్యలను, ముందస్తు నివారణ కార్యక్రమాలను ప్రత్యేకంగా రూపొందించాలన్నారు.

ఇందుకు గాను స్థానిక జిల్లా కలెక్టర్లను, DPOలు, మున్సిపల్ కమీషనర్, DMHO దవాఖానా సూపరిండెంట్‌లతో సహా సంబంధిత స్థానిక అధికారులను సమావేశపరిచి అప్రమత్తం చేయాలన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ, వైద్యారోగ్య పరిస్థితుల పై ప్రగతిభవన్ లో శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో… ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు పాల్గొన్నారు.

వరంగల్ ను హెల్త్ సిటీ గా తీర్చిదిద్దాలి :

వరంగల్ పట్టణాన్ని హెల్త్ సిటీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైద్యాధికారులను సిఎం ఆదేశించారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానా ఏర్పాటుకు సంబంచిన చర్యల గురించి సిఎం ఆరాతీసారు. నూతన దవాఖానను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం ద్వారా తూర్పు తెలంగాణ మొత్తం వైద్యసేవలకు వరంగల్లుకు తరలేలా ఉండాలన్నారు. అన్ని విభాగాలతో కూడిన సమీకృత భవన సముదాయంగా నూతన ఆసుపత్రి నిర్మాణం వుండాలని సిఎం అన్నారు.

ఇవి కూడా చదవండి: Revanth Reddy: అంతా అక్కడి నుంచి వచ్చినవారే.. మంత్రి హరీష్ రావుకు పీసీసీ చీఫ్ రేవంత్ కౌంటర్

Cabinet Meeting: ఈనెల 13న తెలంగాణ కేబినెట్ భేటీ.. కరోనా పరిస్థితి, వ్యవసాయంతోపాటు పలు అంశాలపై చర్చ