Cabinet Meeting: ఈనెల 13న తెలంగాణ కేబినెట్ భేటీ.. కరోనా పరిస్థితి, వ్యవసాయంతోపాటు పలు అంశాలపై చర్చ
తెలంగాణ కేబినెట్ భేటీ ఈనెల 13వ తేదీన సమావేశం కానుంది. కరోన పరిస్థితి, వ్యవసాయం, పల్లె , పట్టణ ప్రగతి.. ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ కేబినెట్ భేటీ ఈనెల 13వ తేదీన సమావేశం కానుంది. CM KCR అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. కరోన పరిస్థితి, వ్యవసాయం, పల్లె , పట్టణ ప్రగతి.. ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో సినిమా థియేటర్ల ఓపెనింగ్ వంటి అంశాలపై చర్చ ఉండే అవకాశం ఉంది.
లాక్‌డౌన్‌ను మే నెల 12వ తేదీ నుంచి అమలు చేసినందువల్ల రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని, కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. ఏపీతో జరుగుతున్న జల వివాదంపై ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉంది. మరోవైపు కరోనా థర్ద్ వేవ్ పై కూడా సర్కార్ దృష్టి సారించింది. కరోనా మూడో దశను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వపరంగా జాగ్రత్తలు, సన్నద్ధతపై మంత్రి మండలి చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. కేబినెట్ సమావేశంలో కరోనా కట్టడి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, వానాకాలం సీజన్ సాగు, ఎరువులు-విత్తనాల లభ్యత, కల్తీ వితన్నాలను అరికట్టడం, పల్లె , పట్టణ ప్రగతి తదితరాలపై చర్చ జరగనుంది.