‘ఆపద సమయంలో తమ చేత లెక్కలేనంత చాకిరీ చేయించుకుని.. ఇప్పుడు అవసరం తీరింది కదాని తొలగిస్తారా..?’
Outsourced nurses: కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధిని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారు. ఆపద సమయంలో మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు.
Outsourced nurses: కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధిని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారు. ఆపద సమయంలో మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు. తీరా అవసరం లేదని గెంటేస్తే.. రోడ్డెక్కి నిరసన బాట పట్టారు అవుట్ సోర్సింగ్ నర్సులు. ఈ క్రమంలో ఓ నర్సు సొమ్మసిల్లి పడిపోయింది. వివరాల్లోకి వెళితే, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్టాఫ్ నర్సులు ఇవాళ(శుక్రవారం) ఆందోళన చేపట్టారు. గాంధీ భవన్ నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడికి నర్స్‌లు బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో మమత అనే నర్స్ సొమ్ము సిల్లి పడిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మమతను ఆస్పత్రికి తరలించారు.
కరోనా కఠిన సమయంలో.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విపరీతమైన నర్సుల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. డిమాండుకు తగ్గ నర్సులు లేక పోవడంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఔట్ సోర్సింగ్ ద్వారా నర్సుల నియామకం చేసింది. ఇప్పుడు వారందరినీ తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో బాధితులు గత్యంతరం లేక ఇవాళ రోడ్డెక్కారు.
ఆపద సమయంలో తమ చేత లెక్కలేనంత చాకిరీ చేయించుకుని.. ఇప్పుడు అవసరం తీరింది కదాని తొలగించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలగించిన 1640 మంది నర్సులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డెక్కి ధర్నాలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తే.. మీరు ఇచ్చే గుర్తింపు ఇదేనా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు నర్సులు.