Telangana Corona Cases: తెలంగాణలో కాస్త తగ్గిన పాజిటివ్ కేసులు, 24 గంటల్లో కొత్తగా ఎన్నంటే..
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1,06,045 శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా 729 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,30,514కు చేరుకుంది. కొవిడ్-19 కారణంగా..
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1,06,045 శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా 729 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,30,514కు చేరుకుంది. కొవిడ్-19 కారణంగా తాజాగా 6 మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3720 మంది చనిపోయారు. మరో 987 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10,942గా ఉంది.
జిల్లాల వారీగా తాజా కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి..
ఆదిలాబాద్-3, భద్రాద్రి కొత్తగూడెం-31, జీహెచ్ఎంసీ-72, జగిత్యాల-19, జనగాం-6, జయశంకర్ భూపాలపల్లి-15, జోగులాంబ గద్వాల-2, కామారెడ్డి-0, కరీంనగర్-42, ఖమ్మం-72, కొమురంభీం ఆసిఫాబాద్-4, మహబూబ్‌నగర్-6, మహబూబాబాద్-30, మంచిర్యాల-45, మెదక్-4, మేడ్చల్ మల్కాజ్‌గిరి-35, ములుగు-21, నాగర్‌కర్నూలు-5, నల్లగొండ-59, నారాయణపేట-3, నిర్మల్-0, నిజామాబాద్-4, పెద్దపల్లి-32, రాజన్న సిరిసిల్ల-22, రంగారెడ్డి-38, సంగారెడ్డి-14, సిద్దిపేట-27, సూర్యాపేట-24, వికారాబాద్-6, వనపర్తి-10, వరంగల్ రూరల్-7, వరంగల్ అర్బన్-51, యాదాద్రి భువనగిరి-20.
మూడో దశ ముప్పును ఎదుర్కొనేందుకు..
మూడో దశ ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న మోదీ సర్కార్ థర్డ్ వేవ్‌పై ముందే మేల్కొన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆక్సిజన్ నిల్వలు.. సరఫరాపై హై లెవల్ మీటింగ్ నిర్వహించారు ప్రధాని మోదీ. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెడికల్ ఆక్సిజన్ నిల్వలపై కీలక సమీక్ష నిర్వహించారు. త్వరలో దేశవ్యాప్తంగా 1500 PSA ఆక్సిజన్ ప్లాంట్లు రానున్నాయి. పీఎం-కేర్స్ సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణవాయువు లభ్యత, ప్లాంట్ల నిర్మాణంపై సమీక్షించారు మోదీ.